Fish : తమిళనాడు(Tamilnadu) లో ఓ జాలరి పంట పండింది.. అతను రోజూ లాగే చేపల వేటకు వెళ్లాడు. వల వేశాడు. చిన్న చిన్న చేపలు కొన్ని పడ్డాయి.. వల బరువెక్కింది. దాంతో.. తోటి జాలర్లను పిలిచి.. వలను మెల్లగా.. బోటులోకి లాగాడు. ఆ తర్వాత చేపల్ని ఓ ట్రేలో వేస్తుండగా.. కాస్త ఎర్రగా ఉన్న చేప ఒకటి కనిపించింది. అది దాదాపు 2 కేజీల బరువు ఉంటుంది. ఆ చేపను చూడగానే.. జాలర్ల మొహాల్లో ఆనందం వెల్లి విరిసింది. అదృష్టవంతుడివి, లక్ష్మీదేవి నిన్ను కరుణించింది అంటూ తోటి జాలర్లు అతన్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే అది మామూలు చేప కాదు.
మత్స్యకారుడు(Fisherman) రవి స్వస్థలం తంజోర్ జిల్లా పట్టుకోట్టై సమీపంలోని అతిరాంపట్నం. సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా అతని వలలో అరుదైన ఔషధ గుణాలున్న చేప చిక్కింది.
కూరాయ్ కథలాయ్ చేపలు కొన్ని రకాల వ్యాధుల నివారణలో కీలకంగా ఉన్నాయి. వీటితో మందులు కూడా తయారుచేస్తారు. అందువల్లే ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇవి అప్పుడప్పుడూ వలకు చిక్కుతుంటాయి.
Also Read : మీ యాడ్స్ సైజ్‌లోనే క్షమాపణలు ఉంటాయా : సుప్రీంకోర్టు