Fish Price : చేప ధర రూ.2 లక్షలా? అయినా ఈ చేపలో అంత ప్రత్యేకత ఏముంది?

మనం అప్పుడప్పుడూ కొన్ని చేపలు అత్యధిక ధరకు అమ్ముడైనట్లు వార్తలు వింటూ ఉంటాం. ఇది అలాంటి వార్తే.. ఆ చేప ప్రత్యేకత ఏంటో చూద్దాం.

New Update
Fish Price : చేప ధర రూ.2 లక్షలా? అయినా ఈ చేపలో అంత ప్రత్యేకత ఏముంది?

Fish : తమిళనాడు(Tamilnadu) లో ఓ జాలరి పంట పండింది.. అతను రోజూ లాగే చేపల వేటకు వెళ్లాడు. వల వేశాడు. చిన్న చిన్న చేపలు కొన్ని పడ్డాయి.. వల బరువెక్కింది. దాంతో.. తోటి జాలర్లను పిలిచి.. వలను మెల్లగా.. బోటులోకి లాగాడు. ఆ తర్వాత చేపల్ని ఓ ట్రేలో వేస్తుండగా.. కాస్త ఎర్రగా ఉన్న చేప ఒకటి కనిపించింది. అది దాదాపు 2 కేజీల బరువు ఉంటుంది. ఆ చేపను చూడగానే.. జాలర్ల మొహాల్లో ఆనందం వెల్లి విరిసింది. అదృష్టవంతుడివి, లక్ష్మీదేవి నిన్ను కరుణించింది అంటూ తోటి జాలర్లు అతన్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే అది మామూలు చేప కాదు.

మత్స్యకారుడు(Fisherman) రవి స్వస్థలం తంజోర్ జిల్లా పట్టుకోట్టై సమీపంలోని అతిరాంపట్నం. సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా అతని వలలో అరుదైన ఔషధ గుణాలున్న చేప చిక్కింది.

25 కేజీల చేపలను వేలం వేయడానికి అతిరాంపట్నం పెద్ద మార్కెట్‌కు తీసుకెళ్లాడు. మిగతా చేపలను మామూలు ధరకే కొన్నారు. కానీ ఆ ఔషధ గుణాలున్న కూరాయ్ కథలాయ్ చేప(Koorai Kathalai Fish) కోసం వేలం వేశారు. ఆ చేప కోసం చాలా మంది పోటీ పడ్డారు. చివరకు దాన్ని రూ.1లక్షా 87 వేల 700కు కొన్నారు. దాంతో రవి పట్టలేని ఆనందం పొందాడు.

కూరాయ్ కథలాయ్ చేపలు కొన్ని రకాల వ్యాధుల నివారణలో కీలకంగా ఉన్నాయి. వీటితో మందులు కూడా తయారుచేస్తారు. అందువల్లే ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇవి అప్పుడప్పుడూ వలకు చిక్కుతుంటాయి.

Also Read : మీ యాడ్స్‌ సైజ్‌లోనే క్షమాపణలు ఉంటాయా : సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు