మనిషి శరీరానికి లవణం ఎక్కువ అవసరం. ప్రతిఒక్కరి శరీరంలో అనేక విధులను నిర్వహించడానికి, కండరాలు మంచిగా పనిచేయాడానికి సోడియం క్లోరైడ్ ఎంతో సహాయపడుతుంది. సోడియం క్లోరైడ్ ఉప్పులో ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కచ్చితంగా ఎంత ఉప్పు కావాలనేది ఇప్పటివరకు ప్రమాణికం లేదు. అయితే మాములుగా ప్యాకెట్లలో దొరికే సాల్ట్‌కి, రాక్ సాల్ట్‌కి తేడా ఏంటో అందరికీ తెలియదు. అంతేకాకుండా టీవీల్లో ప్యాకెట్ సాల్ట్ చాలా మంచిదని చెప్పటం వల్ల చాలామంది వాటినే వాడేస్తున్నారు. అయితే.. అది క్రిస్టల్‌గా ఉండదు అందుకే ఈజీగా కరుగుతుందని అనుకుంటారు. కానీ.. ఆరోగ్య పరంగా రాళ్ల ఉప్పే మంచిదని ఆయుర్వేద నిపునులు చెబుతున్నారు.
కృత్రిమ రసాయనాలను కలిపి తయారు
ప్యాకెట సాల్ట్ యంత్రంలో శుద్ధి చేస్తారు. దీనికి సోడియం, అయెడిన్, క్లోరైడ్ అనే మూడింటి తోపాటు ఉప్పు అందంగా కనిపించేలా కృత్రిమ రసాయనాలను కలిపి తయారు చేస్తారు. అందుకే దీన్ని వాడేవారికి గాయిటర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు అధ్యయన నిపుణులు తెలుపుతున్నారు.అంతేకాదు ఈ ప్యాకెట్ ఉప్పు తినటం వల్లనే అధిక రక్తపోటు వస్తుందని వైద్యులు తెలిపారు. మాములు ఉప్పులో 97 శాతం సోడియం, క్లోరైడ్ 3 శాతం ఇతర మూలకాలు కలిపి రాత్రి సమయంలో ఈ ఉప్పుని నీటి సరస్సుల నుంచి తయారు చేస్తారు. ఈ రాతి ఉప్పులో దాదాపు 85 శాతం సోడియం క్లోరైడ్ కలుపుతారు. ఇక మిగిలిన 15 శాతం జింక్, ఇనుము, రాగి, అయోడిన్, మెగ్నీషియం, మాంగనీస్,సెలీనియం మొదలైన ఖనిజాలతో పాటు సుమారు 84 రకాల మూలకాలు ఇందోలో ఉంటాయి.
రాక్‌సాల్ట్‌గానే పుష్కలంగా ఖనిజాలు
ఈ ఉప్పులో ఉండే ఖనిజాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. ఈ రాళ్ల ఉప్పులో అయోడిన్‌ని కలపాల్సిన పని లేదు. కాగా.. సాధారణ ఉప్పులో మాత్రం అయోడిన్ కలపాల్సి ఉంది. అలాగే బ్లాక్ సాల్ట్‌లో కూడా రాక్‌సాల్ట్‌గానే దీనిలో పుష్కలంగా ఖనిజాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి 1.25 గ్రాముల సోడియం క్లోరైడ్ సరిపోతుందని కొందరు డాక్టర్లు తెలుపుతున్నారు. వివిధ పదార్థాల ద్వారా సోడియం క్లోరైడ్‌ను తీసుకుంటుంది. ముఖ్యంగా మనం తీనే ప్రతి కూరల్లో ఉప్పు లేకుండా దానికి రుచి రాదు. శరీరానికి అవసరమైన సోడియం క్లోరైడ్ లేకపోయినా ఇబ్బందులు వస్తాయి. అయితే మార్కెట్లో దొరికు ప్యాకెట్ ఉప్పు అంత మంచిది కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యానికి రాళ్ల ఉప్పు శ్రేష్టం అని తెలుపుతున్నారు.
రాళ్ల ఉప్పు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు
ఉప్పులో వివిధ రకాల ఖనిజాల వలన వ్యాధులు రావు
జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కీలక పాత్ర
ఉప్పు ఎక్కువగా వడితే అధిక రక్తపోటు వచ్చే ఛాన్స్
రాతి ఉప్పు, రాళ్లఉప్పు వల్ల అధిక బరువు సమస్యలు
నిద్ర సమస్యలు ఉంటే రాళ్ల ఉప్పును తింటే మంచిది
కొంతమంది రాతి ఉప్పును బాడీ స్క్రబ్‌గా వాడుతారు
రాక్‌సాల్ట్ చిగుళ్ళను శుభ్రం చేస్తుంది
మెగ్నీషియం లోపాన్ని రాక్‌సాల్ట్ భర్తీ చేస్తుంది
జీర్ణ సంబంధిత సమస్యలను మెరుగుపరుస్తుంది
ఇది కూడా చదవండి: రక్త సరఫరా బాగుండాలంటే ఈ కూరగాయలు తినండి