Katrina Kaif: దీపికా బాటలోనే మరో సూపర్ లేడీ స్టార్..ఆమె కూడా తల్లి కాబోతోందా?

బాలీవుడ్ లేడీ స్టార్స్ అందరూ వరుసగా శుభవార్తలు చెబుతున్నారు. అనుష్క రెండో సారి తల్లయి అందరినీ సర్‌ఫ్రైజ్ చేస్తే దీపికా తాను కూడా తల్లిని కాబోతున్నా అంటూ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పుడు వీళ్ళ బాటలోనే మరో స్టార్ కత్రినా కైఫ్ నడుస్తోందని టాక్ నడుస్తోంది.

Katrina Kaif: దీపికా బాటలోనే మరో సూపర్ లేడీ స్టార్..ఆమె కూడా తల్లి కాబోతోందా?
New Update

Katrina Kaif - Vikki Kaushal: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో (Anant Ambani Pre Wedding) బాలీవుడ్ తారలు మెరిసారు. ఆలియా-రణబీర్‌లు (Alia Bhatt - Ranbir) తమ కూతురు రాహాతో మెరిస్తే...రణవీర్-దీపికాలు (Ranveer - Deepika) కాబోయే తల్లిదండ్రులుగా కళకళలాడారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, అభిషేక్ బచ్చన్, కాజోల్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, కియారా అద్వానీ, మలైకా అరోరా లాంటి స్టార్స్ అందరూ ఎవరికి వారే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక వీరందరిలో డిఫరెంట్‌గా కనిపించింది మాత్రం కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ దంపతులు.

దుప్పట్టాతో ఫోటోలకు ఫోజులు..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు బాలీవుడ్ కపుల్స్ కూడా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. మీడియాకు కలిసి ఫోజులు ఇచ్చారు. వీరిద్దరినీ చూపిస్తూ బోలెడు వీడియోలు కూడా వచ్చాయి. అయితే మిగతా వారదంరివీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఫోటోలు, వీడియోలు బయటకు వస్తే...కత్రినా-విక్కి జంవి మాత్రం వేడుకలు అయిపోతున్న వెళిపోతున్నప్పుడు. ఎయిర్‌పోర్ట్‌లో ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిల్లో కత్రినా (Katrina Kaif) డ్రెస్సింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ మోడ్రస్ డ్రెస్సుల్లో కనిపించే కత్రినా ఈ పిక్స్‌లో మాత్రం పొట్ట భాగం కనబడకుండా దుప్పట్టాతో కవర్ చేసుకుని కనిపించింది. ముంబైకి తిరిగి వెళ్లే క్రమంలో కూడా ఆమె తన ఉదరాన్ని దుపట్టాతో కప్పుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో కత్రినా కూడా ప్రెగ్నెంట్ అని..అందుకే పొట్ట కనిపించకుండా కప్పుకుందని అంటున్నారు ఫోటోలను, వీడియోలను చూసినవారు.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌కు 2021 డిసెంబర్‌ నెలలో వివాహమైంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కత్రినా, విక్కీల పెళ్లి జరిగి సుమారు రెండున్నరేళ్లు అవుతోంది. పెళ్ళికి ముందు కూడా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు ఎక్కడా రివీల్ చేయలేదు. పెళ్ళికిముందే అందరికీ ఈ విషయం తెలిసింది. అందుకే ఇప్పుడు పిల్లల విషయం కూడా అలాగే సస్పెన్స్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే..మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Also Read:National : ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట.. నిర్దోషి అని ప్రకటించిన బాంబే హైకోర్టు

#katrina-kaif #vikky-koushal #anantha-amabni-pre-wedding #pregnanat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe