Health Benefits: శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందా..అస్సలు నిర్లక్ష్యం చేయకండి

శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. నిద్రపోయే టైంలో శ్వాస సమస్య ఉంటే గుండె మీద ప్రభావం పడుతుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే వారికి రాత్రి పూట సరిగా నిద్ర ఉండదు. ఈ ఎఫెక్ట్ ఆరోగ్యంపై పడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Health Benefits: శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందా..అస్సలు నిర్లక్ష్యం చేయకండి
New Update

ప్రస్తుత కాలంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా..!! ఇన్ఫెక్షన్‌ వల్లతో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో చాలా మంది ఎంతో అసౌకర్యానికి గురవుతారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఒక్కోసారి చలి అధికంగా ఉన్నా, అనారోగ్యం సమస్య వచ్చినప్పుడు, ఎక్కువ బరువు ఉన్నవారికి కూడా శ్వాస తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. కొందరిలో ఈ సమస్య తాత్కాలికంగానే ఉన్నా.. మరి కొంతమందిలో మాత్రం అధికంగా ఉంటుంది. అందువల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే నిర్లక్ష్యం చేయ వద్దని వెంటనే వైద్యులను స్పందించాలంటున్నారు. అయితే.. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్యను దూరం చేయవచ్చు అంటున్నారు.

ఇది కూడా చదవండి:  చలికాలంలో పెరుగు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..!!

అల్లంతో తయారు చేసిన టీ తాగితే శ్వాస సంబంధిత సమస్యలు పోతాయి. శ్వాసకోస వ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లు చాలా వరకు తగ్గుతాయి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.. అందుకే ఊపిరితిత్తుల్లో ఉండే వాపులు త్వరగా తగ్గుతాయి. అల్లం ముక్కలు నీటిలో వేసి దాంతో డికాషన్ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నేరుగా అల్లం రసాన్ని తీసుకున్న హెల్త్‌కి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా తీసుకోవటం వలన శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయని నిపుణులు అంటున్నారు. ప్రతీరోజు బ్లాక్ టీ తాగడం వలన నాసికా రంధ్రాల్లో ఏర్పడిన అడ్డంకులు పోతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే రంధ్రాలు క్లియర్ చేస్తుంది. దీంతో ఆస్తమా ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. అంతేకాదు ఊపిరితిత్తుల పనితీరు కూడా పెరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులన్ని వెంటనే తొలగిపోతాయి.

శ్వాసక్రియ సమస్యలు మెరుగు పడుతుంది

ఇంట్లో ఉన్న గోడకు శరీరాన్ని ఆనించి నిలబడాలి చేతులను తొడలపై ఉంచాలి. భుజాలను వెనక్కి ఉంచి కూల్‌ అవ్వాలి. ఇలా కొద్దిసేపు చేస్తే శ్వాస మంచిగా ఆడుతుంది. నేలపై పద్మాసనంలో కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచి నోటితో గాలిని పిలిచాలి.. ఇలా 5 నుంచి 8 సెకండ్ల పాటు నోట్లోనే గాలిని అలాగే ఉంచుకోవాలి. తరువాత పెదాలను మూసి ముక్కుతో మూడు సెకండ్ల పాటు శ్వాసను బయటకు వదలాలి. ఇలా ప్రతీ రోజు 10 నుంచి 20 సార్లు చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది. కుర్చీలో కూర్చొని ఉన్న రిలాక్స్ అవ్వాచ్చు. కుర్చీలో కూర్చొని కాళ్ళను నెలకు ఆనించి ముందుకు వంగి.. మోచేతులను మోకాళ్లపై ఉంచాలి. అనంతరం చేతులతో గడ్డం పట్టుకుని మెడను భుజాలను ముందుకు వంచి రిలాక్స్ అవ్వాండి. ఇలా రోజూ చేయడం వల్ల శ్వాసక్రియ సమస్యలు మెరుగు పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

#health-benefits #respiratory-problems
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe