IPL Cricket:మళ్ళీ సొంతగూడు ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా?

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ సొంతగూటికి చూరుకున్నాడా అంటే అవుననే చెబుతున్నారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉంటున్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో ముంబైకి వచ్చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

New Update
IPL Cricket:మళ్ళీ సొంతగూడు ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా?

Hardik Pandya: ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మళ్ళీ వెనక్కి తీసుకుంటోందా. దీని కోసం అధిక మొత్తం లో డబ్బు చెల్లిస్తోందా అంటే అవుననే చెబుతున్నారు. హార్దిక్ కోసం ముంబై ఇండియన్స్ యాజమాన్యం...గుజరాత్ టైటాన్స్ కు ఏకంగా 15 కోట్లు ఇవ్వడానికి రెడీ అయిందని చెబుతున్నారు. పైగా తిరిగి గుజరాత్ నుంచి ముంబై ఏ ఆటగాడిని ట్రేడింగ్ లో తీసుకోవడం లేదని కూడా తెలుస్తోంది.

Also Read:రాజస్థాన్ లో పోలింగ్ షురూ..సాయంత్రం ఆరు వరకు పోలింగ్

publive-image

ఐపీఎల్ (IPL) ఫ్రాంఛైజీలు ఆటగాళ్ళను మార్చుకునే అవకాశం మరొక్క రోజులో ముగియనుంది. ఈ సందర్భంలో హార్ధిక్ గురించి వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే దీని గురించి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ యాజమాన్యలు మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో పాటూ హార్దిక్ ముంబై టీమ్ లోకి వచ్చేస్తే ఎలా ఆడతాడు? రోహిత్ కెప్టెన్సీ ఉంటుందా లేదా అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రోహిత్ కెప్టెన్సీలో హార్దిక్ ఆడతాడా...లేదా రోహిత్ ను తప్పించి హార్దిక్ కు కెప్టెన్సీ పట్టాలు అప్పగిస్తారా అనే విషయం తేలాల్సి ఉంటుంది.

రెండేళ్ళ నుంచి హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రెండేళ్ళ నుంచి ఈ టీమ్ ఫైనల్స్ కు చేరుకుంటోంది కూడా. మరి అలాంటప్పుడు హార్దిక్ ను వదులుకోవడానికి గుజరాత్ ఎలా ఒప్పుకుంటుంది అన్నది కూడా ప్రశ్నగా మారింది. ఈ విషయం తేలాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Also Read:ఇవాళ అయినా టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వస్తారా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు