Bigg Boss 7:బిగ్‌బాస్ చివరి వారం కెప్టెన్‌గా అమర్ అవుతాడా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవన్ చివరకు వచ్చేస్తోంది. ఇంకా నాలుగు వారాలే మిగిలి ఉంది. ఇందులో కెప్టెన్ అవడానికి ఇదే చివరి వారం కూడా. మరి ఇందులో అమర్ కెప్టెన్ అవుతాడా? హౌస్ మేట్స్ అతనికి ఛాన్స్ ఇస్తారా?

New Update
Bigg Boss 7:బిగ్‌బాస్ చివరి వారం కెప్టెన్‌గా అమర్ అవుతాడా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 దాదాపుగా చివరకు వచ్చేసింది. ఎవరు విన్నర్ గా నిలుస్తారనే దాని మీద కూడా అంచనాలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. వీరిలో చివరకు శివాజీ (Shivaji), అమర్ (Amar) మధ్యనే పోటీ ఉంటుందని అంటున్నారు. అలాగే హౌస్ కెప్టెన్ అవడానికి ఇదే చివరి వారం. గతవారమే నాగార్జున ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఉన్నవాళ్ళల్లో అమర్, రతిక, అశ్వినిలు ఇప్పటివరకు కెప్టెన్లు అవ్వలేదు.

Also Read:తాగింది నిజమే.. వీడియో తీసింది అందుకే..యూట్యూబర్ నాని సంచలన ప్రెస్ మీట్!

ఎప్పటిలాగే ఈ వారం కూడా హౌస్ కెప్టెన్ ఎవరు అవ్వాలన్న నిర్ణయాన్ని బిగ్ బాస్ (Bigg Boss) హౌస్మేట్స్ చేతిలోనే పెట్టాడు. హౌస్ లో ఒక గన్ పెట్టారు. దాని ఎదురుగా ఇద్దరు ఫోటోలను పెట్టారు. గన్ సౌండ్ వినిపించినప్పుడల్లా ఇద్దరు వచ్చి ఎదురుగా కనిపిస్తున్న ఫోటోల్లో ఎవరు కెప్టెన్ కావాలనుకుంటున్నారో ఏకభిప్రాయానికి వచ్చి ఒక ఫోటోను కాల్చాలి. అలా ఒకొక్కరు ఫోటోను కాల్చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అమర్‌, అశ్విని ఫోటోలు రాగా.. శోభ, ప్రశాంత్‌ ఇద్దరూ అమర్‌కు సపోర్ట్‌ చేద్దాం అని చర్చించుకున్నారు. ఇది విన్న అశ్విని.. నన్ను ఇంకెవ్వరు తీసినా పట్టించుకోకపోయేదాన్ని. కానీ నువ్వు తీసేస్తున్నావ్‌.. చూడు అంటూ ప్రశాంత్‌ (Pallavi Prashanth) మీదన కోపం అయిపోయింది అశ్విని.

ఇలా నడిచిన టాస్క్ లో చివరకు శివాజీ, అమర్, అర్జున్ మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైనల్ గా ఎవరు కెప్టెన్ అయ్యారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే చివరకు అందరూ కలిసి అమర్ నే కెప్టెన్ చేవారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వారం ఎవరూ కెప్టెన్ కాలేదని.. బిగ్ బాస్ టాస్క్ ను కాన్సిల్ చేశారని కూడా టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే రాత్రి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read:ఫ్యూచర్‌లో బీఆర్ఎస్‌ను మ్యూజియంలో చూస్తారు-ప్రియాంక గాంధీ

Advertisment
తాజా కథనాలు