Assembly : తెలంగాణ అసెంబ్లీ లో సమావేవాలు(Telangana Assembly Meetings) వేడివేడి గా జరుగుతున్నాయి. శనివారం నాడు అసెంబ్లీలో సాగునీటి పై ప్రభుత్వం శ్వేత ప్రతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మాట్లాడారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు అనేవి భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.
వందేళ్లు భద్రంగా ఉండాల్సిన కట్టడం మూడేళ్లకే కుప్పకూలిపోయిందని ఆరోపించారు. కీలకమైన బ్యారేజ్ ఇలా నాణ్యత లోపంతో కుంగిపోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇదంతా కూడా గత ప్రభుత్వ అవినీతి వల్ల ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని ఉత్తమ్ పేర్కొన్నారు.
Also Read : కొత్త కార్డుల కోసం ఎదురు చూపులేనా!
అసెంబ్లీలో ఉత్తమ్ హాట్ కామెంట్స్:
---- నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్‌లో లీక్ ప్రారంభమైంది.
---- అన్నారం బ్యారేజ్(Annaram Barrage) కూడా ప్రమాదంలో ఉంది-NDSA .
---- మేడిగడ్డలానే అన్నారం పిల్లర్లు కూడా కుంగుతాయని NDSA హెచ్చరించింది.
---- బ్యారేజ్‌లో కొంత నీటిని ఖాళీ చేయాలని NDSA సూచన.
---- భారీ నాణ్యతాలోపం ఉందని NDSA రిపోర్ట్ ఇచ్చింది.
---- నేషనల్ డ్యామ్ సేఫ్టీ విచారణ జరిపించాలని కోరాం.
---- NDSA ఇచ్చిన రిపోర్ట్‌నే ప్రవేశపెడుతున్నాం- ఉత్తమ్.
---- నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు.
---- కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రానికి లేఖ రాశారు-ఉత్తమ్.
---- మల్లన్న సాగర్ విషయంలో కాగ్ సంచలన అంశాలు బయటపెట్టింది.
---- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం నీటిని అక్రమంగా తరలించుకుపోతోంది.
---- రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో ఆయకట్టు 57 లక్షల ఎకరాలు.
---- గతంతో పోలిస్తే ఒక్కో ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది.
---- అద్భుతమైన ప్రాజెక్టని చెప్పుకున్న కాళేశ్వరం(Kaleshwaram) మూడేళ్లలోనే కూలిపోయింది.
అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్వితా సబర్వాల్ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు.
శ్రీశైలం, సాగర్‌లాంటి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాని అంగీకరించినట్టు లేఖ రాశారు.
Also Read : రాహుల్- ప్రియాంక మధ్య గొడవలు.. అందుకే రాలేదు : బీజేపీ