AP News: ముందుగానే పంటల సాగు.. ఇరిగేషన్ అధికారులు ఏమంటున్నారంటే..!!

అనంతపురం జిల్లాలోని హెచ్‌ఎల్‌సీ ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుతం కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు పడక తుంగభద్రలో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అందుకుగాను ముందుగానే ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు.

New Update
AP News: ముందుగానే పంటల సాగు.. ఇరిగేషన్ అధికారులు ఏమంటున్నారంటే..!!

అనంతపురం జిల్లాలోని హెచ్‌ఎల్‌సీ ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. గతంలో మంత్రులు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చేసిన ప్రకటనలు తర్వాతి కాలంలో జిల్లా వ్యాప్తంగా రైతులు అధిక పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారు. అయితే ప్రస్తుతం కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు పడక తుంగభద్రలో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అందుకు గాను దాదాపు 40 రోజుల ముందుగానే ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: అధికారంలోకి వచ్చిన వెంటనే అంతా అభివృద్ధే: పొన్నం ప్రభాకర్

ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం ఇది ప్రకృతి వల్ల వచ్చిన పరిస్థితులు అంటున్నారు ఇరిగేషన్  అధికారులు. ముఖ్యంగా అనంతరం జిల్లాలో వర్షాలు పడకపోయినప్పటికీ.. కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు పడడం.. తుంగభద్ర డ్యామ్‌కు నీరు చేరేదని ఇరిగేషన్ శాఖ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. అయితే.. ప్రస్తుతం కర్ణాటక ప్రాంతంలో వర్షాలు రాకపోవడంతో.. తుంగభద్రకు నీరు రాకపోవడం వల్ల అనంతపురం జిల్లా రైతులకు సకాలంలో కంటిన్యూగా నీరు అందివ్వడానికి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయని రాజశేఖర్ చెబుతున్నారు. కాగా.. మరోవైపు రైతులు అధిక పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశామని దీనికి ప్రభుత్వమే ఏదో ఒక మార్గం చూపాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతున్నామని ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరిగేషన్ అధికారులు.

తుంగభద్ర డ్యామ్‌కి నీరు చేరకపోవడంతో..

గత సంవత్సరంలో తుంగభద్రకు అధిక నీరు చేరిందని ఎస్సీ రాజశేఖర్ చెప్పారు. మన కాలువల సామర్థ్యం మేరకు మించి నీరు తీసుకున్నప్పటికీ.. మిగతా నీరు సముద్రంలోకి కలిసిపోయిందని ఆయన గుర్తు చేశారు. జిల్లాలోని కొన్ని డ్యామ్‌లకు కూడా గేట్లు ఎత్తాల్సిన పరిస్థితులు గతంలో ఉన్నాయన్నారు. ప్రస్తుతమైతే తుంగభద్ర డ్యామ్‌కి నీరు చేరకపోవడంతో అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ మిర్చి తింటే ఇంక అంతే సంగతులు..ప్రపంచంలో ఘాటైన మిర్చి ఇదే

Advertisment
తాజా కథనాలు