Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో స్టెరాయిడ్స్ తీసుకొని దొరికిపోయాడు.. చివరికి

పారిస్‌లో ఒలింపిక్స్‌ గేమ్స్‌లో ఇరాక్‌కు చెందిన ఓ జుడో ఆటగాడు మోసానికి పాల్పడటంతో అతడిని ఒలింపిక్స్ గేమ్స్‌ నుంచి తొలగించారు. ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. అతడి నుంచి శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసుకుంది. చివరికి అతను రెండు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు రిపోర్టులో తేలడంతో బయటకి పంపించేశారు. 

New Update
Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో స్టెరాయిడ్స్ తీసుకొని దొరికిపోయాడు.. చివరికి

Sajjad Ghanim : ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఒలింపిక్స్‌ గేమ్స్ (Paris Olympics Games) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాక్‌కు చెందిన ఓ జుడో ఆటగాడు మోసానికి పాల్పడటంతో అతడిని ఒలింపిక్స్ గేమ్స్‌ నుంచి తొలగించారు. ఇరాక్‌కి చెందిన సజ్జద్ గహ్నిమ్‌ సెహెన్‌ (Sajjad Ghanim Sehen)  అనే వ్యక్తి మొదటిసారిగా ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనడానికి వచ్చాడు. అయితే ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ITA).. అతడి నుంచి శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసుకుంది. చివరికి అతను రెండు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు రిపోర్టులో తేలింది. దీంతో సజ్జద్‌ను ఒలింపిక్స్‌ నుంచి అధికారులు తొలగించారు. ఈ ఒలంపిక్స్‌ గేమ్స్‌లో స్టేరాయిడ్స్‌ (Steroids) తీసుకొని దొరికిపోయిన వ్యక్తి కూడా ఇతడే కావడం గమనార్హం.

Also Read : ‘మిస్టర్ బచ్చన్’ మాస్ జాతర.. టీజర్ అప్డేట్ వచ్చేసింది..!

Advertisment
Advertisment
తాజా కథనాలు