SRH: దండం సామి.. మీ ముగ్గురు ఇక దయచేయండి.. రూ.31 కోట్లు సేవ్ చేసుకునే ప్లాన్‌లో సన్‌రైజర్స్!

వచ్చే నెలలో ఐపీఎల్‌ మినీ వేలం ఉండగా.. ప్లేయర్ల రిటెన్షన్ గడువు నవంబర్ 26తో ముగియనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన హ్యారీ బ్రూక్ (రూ 13.25 కోట్లు), మయాంక్ (రూ.8.5 కోట్లు) వాషింగ్టన్‌ సుందర్(రూ.8.75 కోట్లు)ను సన్‌రైజర్స్‌ వదిలేసే ఛాన్స్ ఉంది.

SRH: దండం సామి.. మీ ముగ్గురు ఇక దయచేయండి.. రూ.31 కోట్లు సేవ్ చేసుకునే ప్లాన్‌లో సన్‌రైజర్స్!
New Update

ఐపీఎల్‌(IPL)లో ఈ ఏడాది అన్నిటికంటే ఎక్కువగా తమ అభిమానులను నిరాశ పరిచిన జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. నిజానికి ఈ ఏడాదే కాదు.. కొన్నేళ్లుగా ప్రతీ ఏడాది సన్‌రైజర్స్ తమ ఫ్యాన్స్‌ను బాధపెడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2018లో కేన్‌ విలియమ్‌సన్ కెప్టెన్సీలో ఫైనల్‌కి వచ్చారు. తర్వాత వారి ఆట తీసికట్టుగా మారంది. వార్నర్‌ను ఎందుకు వదులుకున్నారో తెలియదు. ఇలా సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌పై అభిమానులు ఫైర్‌ అవుతూ ఉంటారు. ఈ ఏడాది పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌(Sun Risers Hyderabad) లాస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఏడాది 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది హైదరాబాద్‌. 8 పాయింట్లలో మైనస్‌ 0.580 రన్‌రేట్‌తో లాస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. దీంతో వచ్చే ఏడాది జట్టులో భారీ మార్పులు చేసేందుకు యాజమాన్యం ప్లాస్ చేస్తోంది.

ఆ ముగ్గురు వద్దు:
వచ్చే నెలలో ఐపీఎల్‌ ఆక్షన్‌ జరుగనుండగా.. పలు ఆటగాళ్లను వదిలించుకునేందుకు సన్‌రైజర్స్‌ సిద్ధపడింది. భారీగా డబ్బులు తీసుకుంటూ జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడని ఆటగాళ్లని వదిలేసేందుకు రెడీ అయ్యింది. ఈ లిస్ట్‌లో హ్యారీ బ్రూక్, మయాంగ్ అగర్వాల్‌, ఆల్‌రైండర్‌ వాషింగ్‌టన్‌ సుందర్ ఉన్నారు. ప్లేయర్ రిటెన్షన్ గడువు నవంబర్ 26తో ముగియనుంది. అంటే మరి కొన్ని గంటల్లో ఏదో ఒకటి తేలిపోనుంది. ఈలోపు ఫ్రాంచైజీ టీమ్ మేనేజ్‌మెంట్ వచ్చే సీజన్‌లో ఉంచుకోవాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకోవాలి.

రూ.31 కోట్లు మిగులుతాయ్:
ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరుఫున హ్యారీ బ్రూక్ అందరికంటే ఎక్కువగా నిరాశపరిచాడు. రూ.13.25 కోట్లు పెట్టి బ్రూక్‌ను కొనుగోలు చేయగా.. అతను కేవలం 190 పరుగులే చేశాడు. 11 మ్యాచ్‌ల్లో బ్రూక్‌ 190 రన్స్ చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అందులో ఒక సెంచరీ ఉండగా.. మిగిలిన పద మ్యాచ్‌లు కలిపి బ్రూక్‌ చేసింది కేవలం 90 పరుగులే. అటు ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ను కూడా వదిలించుకునేందుకు సన్‌రైజర్స్‌ సిద్ధమైంది. గత వేలంలో రూ.8.5 కోట్లు పెట్టి SRH మయాంక్‌ను కొనుగోలు చేసింది. అయితే 10 మ్యాచ్‌ల్లో మయాంక్ 270 పరుగులే చేశాడు. ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్‌టన్‌ సుందర్‌ గత రెండు సీజన్లగా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ. 8.75 కోట్లు పెట్టి సన్ రైజర్స్ అతడిని సొంతం చేసుకుంది. 2022 సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడి కేవలం ఆరు వికెట్లే తీసిన సుందర్‌ అటు బ్యాటర్‌గా 101 పరుగులే చేశాడు. ఈ సీజన్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. 7 మ్యాచ్‌ల్లో 60 పరుగులే చేసిన వాషి.. కేవలం మూడు వికెట్లే తీశాడు.

Also Read: అతి జాగ్రత్తే కొంపముంచింది.. ఇండియా చేసిన ఐదు తప్పిదాలివే!
WATCH:

#sunrisers-hyderabad #mayank-agarwal #harry-brook #washington-sundar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe