Water Crisis in Bengaluru: కర్నాటక రాజధాని బెంగళూరులో నీటి కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా త్వరలో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సి ఐపీఎల్ (IPL) మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ నిర్వహణ కష్టమేనని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తాగునీరు దొరకక జనం ఇబ్బందులు పడుతుంటే మ్యాచ్ నిర్వహణకు నీరు ఎక్కడనుంచి తెస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) స్పందించింది.
నీటి కొరత లేదు..
ఈ మేరకు బెంగళూరులో నీటి సమస్య ఉన్నా చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswamy Stadium) మ్యాచ్‌లు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కేఎస్‌సీఏ సీఈవో సుబేంధు ఘోష్ పీటీఐతో మాట్లాడుతూ ‘మాకు నీటి కొరత లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలను మేం అనుసరిస్తాం. పిచ్, ఔట్ ఫీల్డ్ నిర్వహణతో పాటు ఇతర అవసరాలకు మాకు ఒక మ్యాచ్‌కు 10 వేల నుంచి 15 వేల నీటి లీటర్లు మాత్రమే అవసరం ఉంటుంది. అందుకు గాను మాకు సొంతంగా ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) కూడా ఉంది. మేం దాని నుంచే నీటి నిర్వహణ చేస్తున్నాం. మాకు గ్రౌండ్ వాటర్ అవసరం లేదు' అని ఆయన తెలిపారు.
Also Read: ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు..సుప్రీం ఆదేశాల ప్రకారం గడువులోగా ఇచ్చిన ఎస్బీఐ.!