IPL: వందలాది మందికి లైఫ్ ఇచ్చిన ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఐపీఎల్ ఆక్షన్‌లో కుర్రాళ్లు జాక్‌పాట్ కొట్టారు. ఈ మినీ ఆక్షన్ కూడా కుర్రాళ్లకు కొత్త లైఫ్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 2010లో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణల మధ్య దేశం విడిచిపెట్టిన లలిత్ అప్పటినుంచి లండన్‌లో ఉంటున్నారు. By Trinath 19 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత్ క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడమే అంటే చిన్న విషయం కాదు. భారత్‌లో క్రికెట్ కాంపిటేషన్ ఏ లెవల్‌లో ఉంటుందో కొలిచే లెక్కలకు సంబంధించిన డివైజ్‌ను ఇంకా కనిపెట్టలేదు. దేశంలోని వేలాది మంది క్రికెటర్లు కావాలనుకుంటారు. వందలాది మంది చివరి వరకు వస్తారు. ఆఖరికి జట్టులోకి వచ్చే వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుంది. ప్రతీఏడాది టీమిండియాకు పదుల సంఖ్యలో ప్లేయర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇదంతా ఐపీఎల్(IPL) పుణ్యమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు రంజీలు, ఇరానీ ట్రోఫి లాంటి వాటిని ప్రతిపాదికన తీసుకోని ప్లేయర్లను సెలక్షన్స్‌లోకి తీసుకునేవారు. ఇప్పుడు టీ20 యుగంలో ఐపీఎల్ కుర్రాళ్లకు వరంగా మారింది. ఐపీఎల్‌లో రాణించి జాతీయ జట్టులోకి వచ్చి స్టార్లగా ఎదిగిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. పాండ్యా, బుమ్రా ఈ లిస్ట్‌లోకే వస్తారు. ఇక ఫామ్ కోల్పోయిన సీనియర్లు ఐపీఎల్‌లో రాణించి జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్లేయర్లకు ఇంత మంచి అవకాశాలు కల్పించిన ఈ లీగ్ ఫౌండర్ ఎవరో తెలుసు కదా? లలిత్ మోదీ(Lalit Modi)..! ఆయన ఇప్పుడు ఇండియాలో లేడు. Also Read: జాక్ పాట్ కొట్టిన వెస్టిండీస్ బౌలర్ .. రూ.11.5 కోట్లకు RCB సొంతం! చుట్టుముట్టిన కేసులు: ఒకప్పుడు భారత క్రికెట్‌లో లలిత్ మోదీ అంటే అదో బ్రాండ్‌గా ఉండేది . ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫౌండర్ ఆయనే. ప్రస్తుతం లలిత్ మోదీ ఇండియాలో లేరు. లండన్‌కు పారిపోయారు. లండన్‌లో నివసిస్తున్న లలిత్ మోదీ 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణల మధ్య దేశం విడిచిపెట్టారు. ఇటీవల దేశంలోని అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన సాల్వే వివాహ వేడుకలో లలిద్ మోదీ కనిపించారు. లలిత్ మోదీ వివాహానికి హాజరు కావడంతో కేంద్రం టార్గెట్‌గా ప్రతిపక్షాలు గతంలో ఫైర్ అయ్యింది. లలిత్ మోదీ లండన్ వెళ్లిపోయి 13ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ కేంద్రం ఏం చేయలేకపోయిందన్నది ప్రతిపక్షాల వాదన. భారతీయ వ్యాపారవేత్త లలిత్ మోదీ క్రికెట్‌లోనూ తన మార్క్‌ను చూపించారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా, 2014 నుంచి 2015 వరకు.. వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2004 నుంచి 2012 వరకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు0. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌ను నిర్వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ ఈ లీగ్‌కు మొదటి ఛైర్మన్ కూడా. Also Read: వామ్మో..! ఎంతకు తెగించార్రా? మా వార్నర్ అన్ననే బ్లాక్ చేస్తారా? #cricket #ipl-auction-2024 #lalit-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి