Rayudu: రాయుడుని రిప్లేస్‌ చేసే ఆటగాడు అతడే.. అసలు విషయం చెప్పేసిన ధోనీ టీమ్ సీఈవో!

2018-2023 వరకు చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన అంబటి రాయుడు వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి అందుబాటులో ఉండడన్న విషయం తెలిసిందే. అందుకే అతని రిప్లేస్‌మెంట్‌ కోసం రూ.8.4కోట్లు ఖర్చు పెట్టి యువ ఆటగాడు సమీర్ ని కొనుగోలు చేశామని CSK CEO విశ్వనాథన్‌ చెప్పారు.

Rayudu: రాయుడుని రిప్లేస్‌ చేసే ఆటగాడు అతడే.. అసలు విషయం చెప్పేసిన ధోనీ టీమ్ సీఈవో!
New Update

తెలుగు తేజం అంబటిరాయుడు కాంపిటేటివ్‌ క్రికెట్ కెరీర్‌ ముగిసిందనే చెప్పాలి. ఈ ఏడాది(2023) ఐపీఎల్‌ కప్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రజెంటేషన్‌ సమయంలో రాయుడునే ట్రోఫీని అందుకున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు విశేషంగా రాణించిన రాయుడుకు ధోనీ ఇచ్చిన గౌరవం ఇదే కావొచ్చు. ఐపీఎల్‌లో రైవల్స్‌ అయిన చెన్నై-ముంబై జట్లకు రాయుడు వారధిగా ఉన్నాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌ ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ నుంచే మొదలైంది. చెన్నైతో ముగిసింది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌. ఇలా రెండు దిగ్గజ జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాయుడు ఏపీ పాలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్నట్టు సమాచారం. వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా రాయుడు పోటి చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు చెన్నై జట్టు విజయాల్లో కీలకంగా ఉన్న రాయుడు లేని లోటును భర్తి చేసేందుకు ఓ యువ ఆటగాడిని కొనుగోలు చేసింది చెన్నై ఫ్రాంచైజీ.

అతని కొనుగోలు అందుకే:
ఈ సీజన్‌ ఐపీఎల్‌లో రూ.20లక్షల బేస్‌ ప్రైజ్‌తో మొదలై రూ.8.4 కోట్లకు అమ్ముడుపోయాడు యువకేరటం సమీర్‌ రిజ్వి. అతను డాషింగ్‌ బ్యాటర్‌. రాయుడు లేని లోటును ఎలా భర్తీ చేయాలా అని ఆలోచించామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో విశ్వనాథన్ చెప్పారు. అయితే అలాంటి అనుభవం ఉన్న ఆటగాడు వేలంలో లేడని.. అందుకే ఓ యువకుడితో రాయుడు స్థానాన్ని భర్తీ చేయాలని భావించినట్టు చెప్పాడు. సమీర్‌ రిజ్విని భారీ ధరకు కొనుగోలు చేయడానికి కారణం అదేనన్నాడు. సమీర్‌ భవిష్యత్‌లో మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడని కితాబిచ్చాడు. తమ టీమ్ కొనుగోలు చేసినందకు ఈ మాట చెప్పడం లేదని.. సమీర్‌ టాలెంట్‌ ఏంటో అందరికి త్వరలోనే తెలుస్తుందన్నాడు విశ్వనాథన్.

CSK IPL 2024 స్క్వాడ్:
ఎంఎస్ ధోని (కెప్టెన్), మోయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్యా రహానే, సిమ్‌జెల్ రషీద్, సిమ్‌జెల్ రషీద్ , నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి.

ఐపీఎల్‌-2024 వేలంలో కొనుగోలు చేసిన CSK ఆటగాళ్లు : రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు), డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ. 2 కోటి), అవనీష్ రావు ఆరవెల్లి (రూ. 20 లక్షలు).

Also Read: నడవలేనిస్థితిలో ఇంటి పెద్ద.. కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన కుల పెద్దలు

WATCH:

#ipl #ms-dhoni #ambati-rayudu #ipl-2024 #chennai-super-kings
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe