IPL: ఎల్లుండి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ గురించి క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ కూడా ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలపైనే ఉంది. వీరిద్దరూ కూడా ఆయా జట్లకు అత్యధికంగా సార్లు ట్రోఫీనిందించిన బెస్ట్ కెప్టెన్లుగా నిలిచారు. వీరి నాయకత్వ లక్షణాలను పోల్చుతూ మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ముంబైని నడిపించిన రోహిత్ శర్మ ఎప్పుడూ తప్పిదాలు చేయలేదని..చెన్నై సారథి మహీ మాత్రం కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేశాడంటూ పార్థివ్ వ్యాఖ్యానించాడు. జట్టు సభ్యుల విషయానికోస్తే రోహిత్ ఎంతో మద్ధతుగా ఉంటాడు. హార్ధిక్ పాండ్య, బుమ్రా ముంబై జట్టులోకి వచ్చిన కొత్తలో పెద్దగా రాణించలేదు. వారిని పక్కనపెట్టాలని జట్టు యాజమాన్యం భావించినప్పటికీ..వారికి రోహిత్ మద్దతుగా నిలిచాడు. వారి ఆటపై నమ్మకం ఉంచి ప్రోత్సహించాడు. దీంతో వీరిద్దరూ ఆ తర్వాత పుంజుకుని అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ రోహిత్ జట్టును నడిపించిన తీరు ఇతరులతో పోల్చలేనిది. దీనికి ఉత్తమ ఉదాహరణ ముంబై రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ ను ఒక్క పరుగు తేడాతోనే గెలిచింది. మైదానంలో ప్రశాంతంగా ఉండగలిగే కెప్టెన్ లేకపోతే ఇది సాధ్యం కాదు. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచుల్లో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు, పొరపాట్లు జరుగుతుంటాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముఖ్యమైన లక్షణం ఏంటంటే..గత 10ఏండ్లలో అతడు చేసిన తప్పు మీకు గుర్తుకురాదు. ధోని కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేశాడు. కీలక సమయంలో పవన్ నేగికి ఓవర్ ఇవ్వడం చేశాడు. కానీ రోహిత్ అలాంటి బ్లండర్లు చేయలేదు. అయితే ధోని సూచనలు ఇస్తూ ఆటగాళ్లకు మ్యాచ్ ను తేలిగ్గా మారుస్తుంటాడు పార్ధివ్ తెలిపాడు.
ప్రతీ మ్యాచ్ కోసం కొన్ని ప్రణాళికలతో బరిలోకి దిగుతుంటాం. కానీ మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు..మనం అనుకున్న ఫలితాలు కొన్ని సందర్బాల్లో రాకపోవచ్చు. అలాంటప్పుడు అప్పటికప్పుడు ప్రణాళికలు మారుస్తుండాలి. రోహిత్ శర్మ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మ్యాచ్ ను గుప్పిట్లో ఉంచుకునేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కెప్టెన్ కు కఠినమైన సవాల్ ఉంటుంది. ఇలా ముంబై జట్టు కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు అని భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
ఇది కూడా చదవండి: ఆపరేషన్ చేసిన రోజే మరణించిన..భారతదేశపు మొదటి మహిళా వైద్యురాలు ఎవరు?