Rohit Sharma: ఐపీఎల్‌కు రోహిత్‌ శర్మ గుడ్‌బై..? షాక్‌లో ఫ్యాన్స్

ముంబై ఇండియన్స్‌తో పాటు ఐపీఎల్‌కు రోహిత్‌ గుడ్‌బై చెప్పనున్నాడన్న వార్తలు అభిమానులను బాధపెడుతున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? 2024 సీజన్‌ రోహిత్‌కు ఆఖరిదా? పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Rohit Sharma: ఐపీఎల్‌కు రోహిత్‌ శర్మ గుడ్‌బై..? షాక్‌లో ఫ్యాన్స్
New Update

అది 2013 ఐపీఎల్‌.. ముంబై ఇండియన్స్‌ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్‌ పాంటింగ్‌ కెప్టెన్సీలో ముంబై ఆట ఏ మాత్రం ఆశించినట్టు లేదు.. పైగా పాంటింగ్‌ టీ20 శైలిలో బ్యాటింగ్‌ చేయడం లేదు.. దీంతో జట్టులో అతని స్థానం కూడా అనవసరమన్న భావన ఉండేది. అదే సమయంలో కెప్టెన్సీ మార్పుపై జట్టు ఓనర్ నీతా అంబానీ దృష్టి సారించారు.. వెంటనే రోహిత్ కనిపించాడు. ఈ ఒక్క నిర్ణయంతో ముంబై ఇండియన్స్‌ దశ, దిశ మారిపోయింది. 2013 ఐపీఎల్‌ ట్రోఫీతో పాటు మొత్తంగా ఐదుసార్లు ముంబైకి కప్‌ అందించాడు రోహిత్.. సీన్ కట్ చేస్తే.. ముంబై ఇండియన్స్‌తో పాటు ఐపీఎల్‌కు రోహిత్‌ గుడ్‌బై చెప్పనున్నాడన్న వార్తలు అభిమానులను బాధపెడుతున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? 2024 సీజన్‌ రోహిత్‌కు ఆఖరిదా?


నాకు ఇదే లాస్ట్!
మే 10న కోల్‌కతాపై మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. ముంబై ఇండియన్స్‌ టీమ్‌ స్ట్రాంగ్‌ అవ్వడానికి, ఐదు కప్పులు గెలవడానికి కారణం తానేనని అర్థం వచ్చేలా రోహిత్‌ కామెంట్స్ చేసినట్టుగా ఆ వీడియో చూస్తే అనిపించింది. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ ఇలా మాట్లాడాడు. 'ఇది నా ఇల్లు.. దేవాలయం. దానిని నేనే నిర్మించా. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. నాకు ఇదే లాస్ట్' అని రోహిత్ చెప్పాడు. ఇదంతా ముంబై ఇండియన్స్‌ గురించే చెబుతున్నాడని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను ముందుగా కేకేఆర్‌ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.. తర్వాత డిలీట్ చేసింది.

ఇప్పటివరకు స్పందించని రోహిత్

నిజానికి ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ జట్టు యాజమాన్యం పట్ల కోపంగా ఉన్నారు. 2024 సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను తీసుకోవడం వారికి నచ్చలేదు. ఈ నిర్ణయం తర్వాత అభిమానులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కొందరు ఏకంగా ముంబై జెర్సీనే తగలబెట్టారు. అటు సోషల్‌మీడియాలో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్‌ గురించి అటు రోహిత్‌ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. రోహిత్‌కు ఇష్టం లేకుండా అంబానీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనకు రోహిత్‌ మౌనం బలాన్ని చేకుర్చింది. నిజానికి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఒక రకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతను సక్సెస్ కావడం కారణంగానే.. టీమ్ ఇండియా కెప్టెన్సీ కూడా దక్కిందని చెప్పవచ్చు. ఏకంగా ముంబై జట్టుకు అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ఘనత రోహిత్‌కే దక్కుతుంది. కెప్టెన్సీలో తిరుగులేని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారధి ధోనీకి చెక్‌ పెట్టిన ఒకే ఒక్కడు రోహిత్‌. ధోనీ వర్సెస్‌ రోహిత్‌లో హిట్‌మ్యాన్‌దే పైచేయి.. ఇలాంటి రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి పక్కనపెట్టడం జట్టులో పెను భూకంపాన్ని సృష్టించింది. పాండ్యా కెప్టెన్సీలో ఎవరూ కూడా మనసు పెట్టి ఆడడం లేదన్న వాదన వినిపిస్తోంది.

Also Read: ముంబై ను వీడుతున్నా.. రోహిత్ శర్మ..ఆడియో బయటపెట్టిన కేకేఆర్ జట్టు

#rohit-sharma #ipl-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe