IPL in Vizag: విశాఖ క్రికెట్ లవర్స్‌కు అలెర్ట్.. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే! విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌కు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలు మొదలువుతాయి. మార్చి 26న ర్దేశిత కౌంటర్లలో టికెట్లను రీడీమ్ చేసుకోవచ్చు. By Trinath 24 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL Tickets Open For Vizag Matches: ఈ సారి విశాఖలోనూ ఐపీఎల్ కనువిందు చేయనుంది. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే సాగర నగర అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెండు మ్యాచ్‌లను ఫిక్స్ చేశారు నిర్వాహకులు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ మొదటగా తొలి విడత షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 15 రోజుల షెడ్యూల్‌లో విశాఖలో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండూ ఢిల్లీ క్యాపిటల్స్‌కుమ్యాచ్‌లు. దీనికి సంబంధించి కీలక్ అప్‌డేట్ వచ్చింది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయాల ముహూర్తం ఫిక్స్ అయ్యింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయ సమయాన్ని ప్రకటించారు. వైజాగ్‌లోని క్రికెట్ ఔత్సాహికులు ఇప్పుడు రెండు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ల కోసం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఇవాళ( మార్చి 24) ఉదయం 10:00 గంటలకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ధరలు ఎంతంటే? మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగే పోరు కోసం ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు మార్చి 27న ప్రారంభమవుతాయి. పేటిఎమ్ ఇన్‌సైడర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటట్స్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్లను అందిస్తోంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేసే వారు ప్రతి మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేస్తున్న నిర్దేశిత కౌంటర్లలో వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. కోల్‌కతా మ్యాచ్ టిక్కెట్‌ల కోసం మార్చి 26న రిడెంప్షన్ ప్రారంభమవుతుంది. అటు చెన్నైతో మ్యాచ్ కోసం టిక్కెట్ రిడంప్షన్ మార్చి 27న ఉదయం 11:00 గంటలకు పీఎం పాలెంలోని స్టేడియం 'B' గ్రౌండ్, విశాఖపట్నంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. రూ.7,500, రూ.5,000, రూ.3,500, రూ.3,000, రూ.2,500, రూ.2,000, రూ.1,500, రూ.1,000 డినామినేషన్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ధోనీ, పంత్, రస్సెల్ లాంటి స్టార్ క్రికెటర్ల ఆటను చూడడం కోసం అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో ధోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన కెరీర్ తొలినాళ్లలో వైజాగ్ స్టేడియంలో పాకిస్థాన్‌పై ధోనీ 148 రన్స్ చేశాడు. Also Read: ఊరించి.. ఉసురుమనిపించారు.. హైదరాబాద్ కోంపముంచింది ఆత్రమే! #ms-dhoni #delhi-capitals #rishab-pant #ipl-2024 #kolkata-knight-riders మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి