IPL vs Karthika Deepam: నేటి నుంచే కార్తీకదీపం-2.. నెట్టింట్లో జోరుగా మీమ్స్..ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకేనా?

ఓవైపు ఐపీఎల్‌.. మరోవైపు ఎలక్షన్‌ ఫీవర్‌.. ఇంతలోనే కార్తీక దీపం మధ్యలో దూరింది. కార్తీక దీపం సీజన్‌-2 ఇవాళ్టి(మార్చి 25) నుంచి మొదలుకానుంది. ఇది ఇంట్లో పిల్లలకు, మహిళలకు మధ్య టీవీ చిచ్చుకు దారి తీసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

IPL vs Karthika Deepam: నేటి నుంచే కార్తీకదీపం-2.. నెట్టింట్లో జోరుగా మీమ్స్..ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకేనా?
New Update

Karthika Deepam Serial: రాత్రి 7 గంటల 30 నిమిషాలు.. రోజులాగే ఐపీఎల్‌ మ్యాచ్‌ పెట్టుకున్నాడు బంటి. రోహిత్‌ శర్మ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్నాడు. అరగంటలోనే హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు.. బంటిలో తెలియని ఆనందం ఉప్పొంగుతోంది. ఇంతలోనే ఛానెల్‌ మారింది. అటు ఇటు చూసేలోపే 'ఆ ఆ ఆ..' అంటూ దీపక్క(వంటలక్క) మళ్లీ దీపాలను పట్టుకుని టీవీలో కనిపించింది. వెంటనే బంటికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఇంతలోనే బామ్మ పక్కన కూర్చొంది.

'ఇదేంటి బామ్మ ఈ సీరియల్‌ మళ్లి వస్తుంది అని చాలా అమాయకంగా అడిగాడు బంటి.

'ఇవాళ్టి నుంచి మళ్లీ స్టార్ట్' అయ్యిందని బామ్మ ఆనందంతో చెప్పింది.

అంతే వెంటనే బంటి నోట రాలేదు. లక్షల మంది కూర్చునే క్రికెట్‌ స్టేడియంలో తాను ఒంటిరివాడిలా ఉన్నట్టు అనిపించింది. మ్యాచ్‌ పెట్టమని ఎంత బతిమలడినా బామ్మ కనుకరించలేదు. సీరియల్‌ మధ్యలో యాడ్స్‌ సమయంలోనూ రిమోట్ వదల్లేదు. అరగంట తర్వాత రిమోట్ ఇచ్చింది. ఈ లోపు రోహిత్ శర్మ ఔట్ కూడా అయిపోయాడు. బంటికి బాధ కలిగింది. మొబైల్ లేదు.. టీవీలో మ్యాచ్‌ను చూడనివ్వలేదని ఫీల్ అయ్యాడు.

టైమ్ మారడంతో మొదలైన చిచ్చు:
ఇవాళ్టి నుంచి చాలా ఇళ్లలో కనిపించే దృశ్యాలు ఇవి. ఎందుకంటే కార్తీక దీపం క్రేజ్ మాములుగా ఉండదు. ఈ సీరియల్‌ సృష్టించిన సెన్సెషన్‌ అంతాఇంతా కాదు. కార్తీక దీపం గతంలో 7:30 గంటలకు మా టీవీలో వచ్చేది. అది ఐపీఎల్‌ టైమ్ కాదు. ఎందుకంటే అప్పుడు ఐపీఎల్‌ 8 గంటలకు వచ్చేది. ఈసారి మాత్రం ఐపీఎల్‌ 7:30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఇది పిల్లలకు పెద్ద సమస్యగా మారింది. ఈ కార్తీక దీపం సీరియల్‌కి మహిళల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఎక్కువ. సీజన్‌-2 మొదలవడానికి ముందు ఏకంగా ఆ సీరియల్‌ ప్రొడ్యూసర్‌ ఏకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరి ప్రమోషన్‌ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు సోషల్‌మీడియాలోనూ కార్తీక దీపానికి చెందిన వంటలక్క మీమ్స్‌ తెగ వైరల్ అవుతుంటాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్పోర్ట్స్‌ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను ఓ భాషకు మాత్రమే పరిమితమైన ఓ సీరియల్‌ పోటి ఇస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఇండియాలో క్రికెట్ ఓ మతం.. అయితే కార్తీక దీపానికి ఉన్నది మాత్రం కల్ట్‌ ఫాలోయింగ్‌. మరి చూడాలి ఇంట్లో మహిళలు, పిల్లలు మధ్య కార్తీక దీపం పెట్టే చిచ్చు ఎంతకాలం కొనసాగుతుందో!

Also Read: మరోసారి ఫస్ట్‌ మ్యాచ్‌ దేవుడుకి.. ఇలా ఓడిపోకపోతే అంబానీ మావా ఫుడ్‌ పెట్టడు కావొచ్చు!

Also Read: బుద్ధి బయటపడింది.. పాండ్యా వల్లే మ్యాచ్‌ పోయింది.. ఎందుకంటే?

#cricket #ipl-2024 #karthika-deepam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe