IPL 2024: కేకేఆర్ జట్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంభీర్! ఐపీఎల్( IPL)2024 కల్ కత్తా నైటే రైడర్స జట్టుకు ఈ సీజన్ నుంచి టీమిండియా మాజీ క్రికేటర్ గౌతమ్ గంభీర్ మెంటర్ గా వ్యవహరించనున్నాడు. తన పదవీ కాలం ముగిసే సమయానికి కేకేఆర్ జట్టును మెరుగైన స్థితికి తీసుకువెళతానని గంభీర్ వెల్లడించారు. By Durga Rao 19 Mar 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gautam Gambhir: ఐపీఎల్ టోర్నిలో కోల్ కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టుకు మంచి గుర్తింపు లభించింది. IPL తొలినాళ్లలో అంతగా కల్ కత్తా జట్టుకు గుర్తింపు లేదు. కాని దిల్లీ(DELHI) జట్టు నుంచి కేకేఆర్ జట్టు బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ ఆ జట్టు దశ మార్చేశాడు. గంభీర్ సారథ్యంలో 2012,2014 సీజన్లలో జట్టును విజేత గా నిలిపాడు. ఆ తర్వాత గంభీర్ కేకేఆర్ జట్టు ను వీడటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. 2021 లో ఫైనల్ కు చేరిన విజేతగా నిలవలేక రన్నరప్ తో సరిపెట్టుకుంది. తిరిగి మరలా కేకేఆర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించునున్నాడు. ఈ సారి ప్లేయర్ గా కాకుండా మెంటర్ బాధ్యతలు స్వీకరించ బోతున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ ముందు జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో గంభీర్ మాట్లాడాడు. తన పదవీకాలం ముగిసే సమయానికి కల్ కత్తా జట్టును మెరగైన స్థాయిలో ఉంచుతానని తెలిపాడు. ఈ నెల 23న ఈడెన్ గార్డెన్స్(EDEN GARDENS) లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) తో కల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) తొలి మ్యాచ్ ఆడనుంది. నేను కేకేఆర్ ను విడిచిపెట్టివెళ్లే సమయానికి కేకేఆర్ ను మైరుగైన స్థితికి తీసుకువెళతాను. నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. నేను కేకేఆర్ ను విజయ పథంలో తీసుకు రాలేదు.కేకేఆరే తనకు కెప్టేన్ బాధ్యతలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చిందని గంబీర్ స్పష్టం చేశాడు. నన్ను డీల్ చేయటం చాలా కష్టం,ఇన్నాళ్లుగా నన్ను భరిస్తున్న షారుఖ్ ఖాన్ కు( కేకేఆర్ యజమాని) ,మైసూర్ వెంకీ( కేకేఆర్ మేనేజింగ్ డైరేక్టర్) కు ధన్యవాదాలు తెలిపాడు. కేకేఆర్ జట్టుకు ఆడుతున్న కొత్తలో షారుఖ్ నా వద్దకు వచ్చి ఈ జట్టు నీదే ఓడినా,గెలిపించా నీ ఇష్టం అని అన్నారని గౌతమ్ గుర్తు చేసుకున్నాడు. Also Read: ఆ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను .. వైరలవుతున్న కుమారి ఆంటీ ఇంటర్వ్యూ ..! #gambhir #gautam-gambhir #kkr #ipl-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి