IPL 2024 : కోల్ కతా తో ఫైనల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ డెసిషన్?

ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్స్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెపాక్‌ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతుంది. ఇలాంటి తరణంలో శనివారం నిర్వహించాల్సిన ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకోవాలని హైదరాబాద్ టీమ్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

IPL 2024 : కోల్ కతా తో ఫైనల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ డెసిషన్?
New Update

IPL 2024 Finals : ఐపీఎల్ 2024 (IPL 2024) లీగ్ చివరి దశకు చేరుకుంది. ఈసారి ఫైనల్స్ లో కోల్ కతా (Kolkata), హైదరాబాద్ (Hyderabad) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్‌-2కు ఆతిథ్యం ఇచ్చిన చెపాక్‌ స్టేడియంలోనే ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతుంది. ఫైనల్స్ ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సన్ రైజర్స్ షాకింగ్ డెసిషన్

క్వాలిఫయర్ -2 లో రాజస్థాన్ ని ఓడించిన హైదరాబాద్ ఒక్క రోజు విరామం తర్వాత కోల్ కతా తో ఫైనల్ ఆడేందుకు రెడీ అవుతుంది. కాగా శనివారం నిర్వహించాల్సిన ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియా (National Media) లో కథనాలు వస్తున్నాయి.

Also Read : విడాకులకు సిద్ధమైన హార్డిక్ పాండ్యా-నటాషా.. ఆ ఫొటోలన్నీ డిలిట్!

చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, తేమ ఎక్కువగా ఉండడంతో ఆటగాళ్లు ఫిట్‌గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కోల్ కతా విషయానికొస్తే, ఫైనల్స్ కి ముందు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న KKR ప్లేయర్స్ శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరో ప్రాక్టీస్‌ సెషన్‌ను ఏర్పాటుచేయాలని చూస్తున్నారు.

#ipl2024-final #srh-vs-kkr #sunrisers-hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి