IPL 2024: మహేంద్రుడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన హర్భజన్ సింగ్!

ధోనీ డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌ చేస్తున్నాడంటే ఇంక ఫ్యాన్స్ కు పండగే..అతడు కొట్టే సిక్సులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.అయితే తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్‌ సింగ్‌, మహేంద్రుని సిక్సులు కొట్టే సామర్థ్యంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

IPL 2024:  మహేంద్రుడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన హర్భజన్ సింగ్!
New Update

ఐపీఎల్‌ 2024(IPL 2024) ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఎంఎస్‌ ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఇప్పుడు సాధారణ ప్లేయర్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో ఆడుతున్నాడు. చాలా ఏళ్ల క్రితమే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనీకి ఇదే లాస్ట్‌ ఐపీఎల్ సీజన్‌ అనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో అభిమానులు చెన్నై మ్యాచ్‌లకు భారీగా స్టేడియాలకి తరలివస్తున్నారు. ధోనీ డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చి బాదుతున్న సిక్సులకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలో టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు హర్బజన్‌ సింగ్‌, మహేంద్రుని సిక్సులు కొట్టే సామర్థ్యంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

* చెన్నై వర్సెస్‌ ముంబై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌(CSK), ముంబై ఇండియన్స్‌(MI) అత్యంత విజయవంతమైన టీమ్స్‌గా నిలిచాయి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముంబై అత్యధిక టైటిల్స్‌ గెలిచిన (5) జట్టుగా రికార్డు సృష్టించింది. మరోవైపు ధోనీ సారథ్యంలోని చెన్నై ఐపీఎల్‌ 2023లో ట్రోఫీని అందుకుని ముంబై రికార్డును సమయం చేసింది.

 ధోనీని ప్రశంసించడంతో చిరాకు పడ్డ హర్భజన్‌

స్టార్ట్ స్పోర్ట్స్‌లో యాంకర్‌ తనయ్ తివారీ, ధోనీ 2010 ఫైనల్‌లో ఒక సిక్స్ కొట్టినందుకు ప్రశంసించాడు. అతని మాటలు హర్భజన్ సింగ్‌ను చిరాకు తెప్పించాయి. మాజీ CSK కెప్టెన్‌ ధోనీకి ప్రాముఖ్యత ఇవ్వడం హర్భజన్‌కి నచ్చలేదు. ‘ధోనీ అసాధారణంగా ఏమీ చేయలేదు. ఆ గేమ్‌లో కీరన్ పొలార్డ్ కూడా సిక్సర్లు కొట్టాడు. ఒంటి చేత్తో సిక్స్ కొట్టడం పెద్ద విషయం కాదు. ఇది గేమ్‌లో కామన్‌గా జరుగుతుంది’ అని హర్భజన్ సింగ్ అన్నాడు. అయితే బజ్జీ మాటలతో యాంకర్‌ తనయ్‌ తివారీ ఓ అడుగు వెనక్కేశాడు. ఈ కామెంట్స్‌కు రిప్లై చెప్పడానకి ధైర్యం చేయలేదు.

#harbhajan-singh #cricket #ms-dhoni #ipl-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి