ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. దేశీయ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం అయిన ఫ్లిప్ కార్ట్ మరొక సరికొత్త సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ దీపావళి ధమాక సేల్. ఈ సేల్ సందర్భంగా కంపెనీ ఎన్నో బంపర్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఈ దీపావళీ ధమాకా సేల్ ద్వారా కంపెనీ అనేక రకాల ఉత్పత్తులపై మంచి తగ్గింపు ధరలను అందిస్తుంది.
ఈ బంపర్ సేల్ స్మార్ట్ ఫోన్ల నుంచి హోం అప్లయెన్సెస్ వరకు ల్యాప్ ట్యాప్స్ నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వరకు స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ వాచెస్ వరకు ఇలా అన్నింటిపై డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్టు అందిస్తుంది. ఒక వేళ మీరు మీకు నచ్చిన ప్రొడక్టును ఎస్ బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా ప్రొడక్టు కొనుగోలు చేస్తే 5శాతం వరకు అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.
ఇక ఈ సేల్లో భాగంగా ఐఫోన్ 13పై ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్ ను అందిస్తుంది. ఈ ఆఫర్ ను వినియోగించుకోవడం ద్వారా వినియోగదారులు ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ను కేవలం రూ. 999లకే పొందవచ్చు. ఎలాగంటే ఐఫోన్ 14 బేస్ వేరియంట్ అయిన 128జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో రూ. 51, 999లకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 59,900. మీరు ఐఫోన్ 13ను హెచ్ డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే రూ. 2000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 49,999లకు తగ్గింది. మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసినట్లయితే..రూ. 49, 000వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను అందిస్తుంది. దీంతో ఐఫోన్ 13 ధర కేవలం రూ. 999లకే లభిస్తుంది. అయితే మీరు రూ. 49,000పూర్తి ఎక్స్చేంజ్ ఆఫర్ ను పొందాలనుకుంటే మాత్రం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇతర స్మార్ట్ ఫోన్ ఉంటే దాని కండిషన్ మోడల్, బ్రాండ్ ఆధారంగా ఎక్స్చేంజ్ బోనస్ మారుతూ ఉంటుంది.
ఇది కూడా చదవండి: టెన్త్ అర్హతతో 1832 రైల్వే జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే..!!