Ayodhya Ram Mandir : రామలయ ప్రాణప్రతిష్టకు ప్రముఖులకు ఆహ్వానం

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానిస్తున్నది.

New Update
Ayodhya Ram Mandir : రామలయ ప్రాణప్రతిష్టకు ప్రముఖులకు ఆహ్వానం

ఈ నెల 22న అయోధ్య రామలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 11,000 వేలమంది ప్రముఖులకు రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాలు పంపుతుంది. వీరిలో రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.

ప్రముఖులకు అహ్వానాలు

ఇప్పటికే పలువుేరు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసే కార్యక్రమంలో ట్రస్ట్ నిమగ్నమైంది. వీరిలోసచిన్ టెండూల్కర్ తో పాటు నీరజ్ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాణీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, పీవీ సింధు తదితరులు ఉన్నారు. సినీ ప్రముఖలు చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రజనీకాంత్ ,ధనుష్‌, రణబీర్ సింగ్, జాఖీష్రాఫ్ తదితరులు ఉన్నారు. టాలీవుడ్ కు చెందిన రామ్ చరణ్ దంపతులకు కూడా ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే రామ్‌చరణ్‌-ఉపాసనలను రామమందిర ట్రస్టు ప్రతినిధులు శుక్రవారం ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులు పంచుకుంటున్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం సన్నాహకాలను చేస్తున్న రామ జన్మబూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు దగ్గరుండి మరీ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తుంది. ప్రధాని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ రోజు అతిథులకు ప్రత్యేక లడ్డూ పంపిణీకి కూడా ఏర్పాట్లు చేసింది. లక్ష మందికి పైగా భక్తులు 22న అయోధ్యకు వస్తారని టెంపుల్ ట్రస్ట్ అంచనా వేస్తుంది.

కాషాయ జెండాలకు డిమాండ్

రామమందిర ప్రాణప్రతిష్ఠ సమీపిస్తున్న తరుణంలో అయోధ్యలో శ్రీరాముడు, హనుమంతుడితో కూడిన చిత్రాలు, జైశ్రీరాం అని ఉన్న జెండాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 22న అయోధ్యకు పలువురు ప్రముఖులు వచ్చే అవకాశం ఉండటంతో సాధారణ ప్రజలను అనుమతించే అవకాశం లేదు. దీంతో అయోధ్యకు సమీపంలో ఉన్న ప్రాంతాల ప్రజలు ముందుగానే ఆలయాన్ని సందర్శించుకుంటుండంతో అయోధ్యలో జనసందడి పెరిగింది. అనేక మంది రామభక్తులు జెండాలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. వాటిని 22న గ్రామాల్లో పంచుతామని చెబుతున్నారు. ఆ రోజున ప్రతి ఇంటిమీద కాషాయం జెండా ఎగురవేస్తామని చెబుతున్నారు. కాగా ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సాధువులు కూడా రామమందిర ప్రాణప్రతిష్ట కోసం ముందుగానే చేరుకుంటున్నారు. అయోధ్య నగరమంతా సాధువులతో నిండిపోయింది.

పటిష్ట భద్రత

ప్రాణ ప్రతిష్ట రోజున అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. దీనికోసం వందలాది డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలీసు దళాలకుతోడు వారికి సాయపడేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. 22న అయోధ్యలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండటం కోసం అవసరమైన సూచనలు చేస్తున్నామన్నారు. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నందున వారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు