ICC World Cup 2023: వరల్డ్‌ కప్ ఫైనల్‌కు ముందు ఇండియా-ఆస్ట్రేలియా ఆటగాళ్లకు విందు ఎక్కడో తెలుసా..?

ఆదివారం వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రత్యేక విందు ఆహ్వానం అందింది. గుజరాత్‌లోని సబర్మతి నదిపై నిర్మించిన రివర్‌ క్రూయిజ్‌ రెస్టారెంట్‌లో వీళ్ల కోసం డిన్నర్‌ ఏర్పాట్లు చేశారు.

New Update
ICC World Cup 2023: ఫైనల్‌ సమరానికి సిద్ధం.. మరీ అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసా.. ?

ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్టేడియంలో ఆదివారం జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు తెల్లారవుతుందా.. ఎప్పుడు మ్యాచ్‌ స్టార్ట్‌ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌ జరిగే ముందు ఇరుజట్లకు ఈరోజు ప్రత్యేక విందు ఆహ్వనం అందింది. సబర్మతి నదిపై నిర్మించిన అక్షర్ రివర్‌ క్రూయిజ్‌ రెస్టారెంట్‌లో విందుకు ఆహ్వానించారు. అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ సుహార్‌ మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ కప్‌ మ్యాచ్‌కు ముందు అన్ని జట్లను ఇక్కడ డిన్నర్‌కు ఆహ్వానించామని తెలిపారు. ఇప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న సందర్భంగా ఈరోజు కూడా టీమింటియా, ఆస్ట్రేలియా జట్ల కోసం డిన్నర్‌ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

Also read: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతా.. ఎవరన్నారంటే..

ఇక క్రికెటర్లకు ఈ విందులో మిల్లెట్లతో పాటు గుజరాత్‌కు చెందిన ఫుడ్‌ ఐటెమ్స్‌ని మెనులో చేర్చినట్లు తెలుస్తోంది. అలాగే దీంతోపాటు ఇరుజట్ల ఆటగాళ్లు అటల్‌ఫుడ్‌ ఓవర్‌ బ్రిడ్జిని కూడా సందర్శించనున్నారు. ఇదిలాఉండగా.. ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ గత బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 70 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. భారత్ తరఫున మహమ్మద్ షమీ 7 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. కాగా, విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీ సాధించాడు. దీంతో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీ సాధించాడు. ఆదివారం జరగనున్న ఈ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఎవరూ గెలవనున్నారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు పాటు వేచిచూడాల్సిందే.

Also read: వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ రోజున.. ఢిల్లీలో మద్యం నిషేధం.. ఎందుకంటే..

Advertisment
తాజా కథనాలు