Ajith Dowal: రాజీవ్‌ గాంధీతో అజిత్‌ దోవల్...ఈ ఫోటో కథేంటంటే!

అజిత్‌ దోవల్‌.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువగా నమ్మే వ్యక్తుల్లో దోవల్ ఒకరు. యుద్ద వ్యూహాల్లో దోవల్ దిట్ట.సోషల్‌మీడియాలో అజిత్‌ దోవల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. 36ఏళ్ల నాటి క్రితం రాజీవ్ గాంధీతో ఉన్న ఫొటో అది.. ఈ ఫొటో వెనుక కథేంటో ఇవాళ తెలుసుకుందాం!

New Update
Ajith Dowal: రాజీవ్‌ గాంధీతో అజిత్‌ దోవల్...ఈ ఫోటో కథేంటంటే!

అజిత్‌ దోవల్‌.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువగా నమ్మే వ్యక్తుల్లో దోవల్ ఒకరు. యుద్ద వ్యూహాల్లో దోవల్ దిట్ట. పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టడంతో ఆయన కీలకంగా వ్యవహరించారు. గతంలో అనేక ఆపరేషన్లలో చాకచక్యంగా నిర్వహించిన దోవల్.. ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవలి సోషల్‌మీడియాలో అజిత్‌ దోవల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. 36ఏళ్ల నాటి క్రితం రాజీవ్ గాంధీతో ఉన్న ఫొటో అది.. ఈ ఫొటో వెనుక కథేంటో ఇవాళ తెలుసుకుందాం!

NSA అజిత్ దోవల్, ఆయన ధైర్యసాహసాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసు. 2014లో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అజిత్ దోవల్ దేశంలోని సామాన్య ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందారు. శక్తివంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మాజీ ప్రధాన మంత్రులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. 1998లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో అమెరికా తరహాలో జాతీయ భద్రతా సలహాదారు పదవిని ఏర్పాటు చేశారు. మాజీ దౌత్యవేత్త బ్రజేష్ మిశ్రా దేశం మొదటి NSAగా నియమితులయ్యారు. అజిత్ దోవల్ దేశానికి ఐదవ జాతీయ భద్రతా సలహాదారు. ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత సన్నిహితులుగా, విశ్వసనీయంగా భావిస్తారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన దశాబ్దాల నాటి ఫొటో 1988 సంవత్సరానికి చెందినది. ఈ అరుదైన ఫొటోలో అజిత్‌ దోవల్‌ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, IB డైరెక్టర్ MK నారాయణన్‌తో చర్చలో దోవల్‌ మునిగిపోయి ఉన్న ఫొటో అది. ఆపరేషన్ బ్లాక్ థండర్-2 వ్యూహంపై బ్రీఫింగ్ సమయంలో ఈ ఫొటో క్లికైనట్టుగా తెలుస్తోంది.

Also read:  కుక్క తోక వంకరే.. చైనా బుద్ది వంకరే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు