12 Years Of Gabbar Singh : 'గబ్బర్ సింగ్' చేయడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదా? ట్రెండ్ సెట్టర్ మూవీ వెనక అంత కథ నడిచిందా?

12 Years Of Gabbar Singh : 'గబ్బర్ సింగ్' చేయడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదా? ట్రెండ్ సెట్టర్ మూవీ వెనక అంత కథ నడిచిందా?
New Update

12 Years Of Gabbar Singh : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినీ కెరీర్లో 'గబ్బర్ సింగ్'(Gabbar Singh) సినిమాకి ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటిదాకా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న పవన్ కి 'గబ్బర్ సింగ్' భారీ కం బ్యాక్ ఇచ్చింది. హరీశ్ శంకర్(Harish Shankar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లోనే ఓ ట్రెండ్ సెట్ చేసింది.

సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ చేసిన రచ్చకి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. 2012 మే 11 న విడుదలైన ఈ సినిమా నేటితో(శనివారం) 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..

'గబ్బర్ సింగ్' చేయడం పవన్ కి ఇష్టం లేదా?

'గబ్బర్ సింగ్' మూవీ హిందీలో వచ్చిన 'దబాంగ్' కి రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే ముందు ఈ రీమేక్ లో నటించేందుకు పవన్ ఆసక్తి చూపలేదట. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భం లో చెప్పారు. " దబాంగ్ రీమేక్ నేను చేస్తే బాగుంటుందని, ఆ సినిమా రిలీజ్ అయిన 2, 3 నెలలకు నాకు చూపించారు. అది చూసిన తర్వాత ఇలాంటి మూవీలో నేను ఎలా నటించాలో అర్ధం కాలేదు.

Also Read : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

ఈ సినిమా కథనం అంతా సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటంతో నేను చేయనని చెప్పా. కానీ కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్ లో తొందరగా కంప్లీట్ అయ్యే సినిమా చేయాలని డిసైడ్ అయ్యా. ఆ టైం లో దబాంగ్ గుర్తొచ్చి మళ్ళీ సినిమా చూసా. అప్పుడు నటించాలని ఫిక్స్ అయ్యా" అని అన్నారు.

'గుడుంబా శంకర్' స్ఫూరితో

'గబ్బర్ సింగ్' లో పవన్ పోషించిన పోలీస్ రోల్ ని 'గుడుంబా శంకర్' సినిమాలోని ఓ సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారట. సినిమాలో పోలీస్ రోల్ ఎలా ఉండాలో డిసైడ్ చేసింది కూడా పవన్ కల్యాణే. సినిమాలో హీరో తన వృత్తి పట్ల ఎంతో నిబద్దతతో ఉంటాడు. కానీ అతని డ్రెస్సింగ్ స్టైల్, మాట్లాడే తీరు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దీని కోసం గుడుంబా శంకర్ మూవీలోని ఓ సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారట.

#harish-shankar #pawan-kalyan #12-years-of-gabbar-singh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe