/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/accident-1-1-jpg.webp)
Visakha : విశాఖలో మద్యం మత్తు(Alcohol Intoxication) లో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో మద్యం మత్తులో కారు(Car Accident) లో వెళ్తూ రెండు బైకులను ఢీ కొట్టింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంటర్ రోడ్ పై నుంచి డివైడర్ డికొట్టడంతో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అత్యవసర చికిత్స కోసం వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Also Read: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్!
యువతి బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని(B.Tech 3rd Year Student) గా గుర్తించారు. బ్లాక్ కలర్ వోక్స్వాగన్ వెంటో కార్ ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావడంతో విద్యార్థిని చిన్నచిన్న గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు(Traffic Police). పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.