Governer: ఓ మహిళా గవర్నర్ కు ఆమె ప్రవర్తన సరిగా లేని కారణంగా 13 ఏళ్ల జైలు శిక్షతో పాటు...సుమారు కోటిన్నర ఫైన్ కూడా వేశారు. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా..? చైనాలో...చూడటానికి ఎంతో అందంగా కనిపించే జాంగ్ యాంగ్ అనే మహిళ.. గుజావ్ ప్రావిన్సులో సీపీసీ పార్టీ గవర్నర్‌గా, డిప్యూటీ సెక్రటరీగా చేశారు. అంతేకాకుండా ఆమెకు బ్యూటీఫుల్ గవర్నర్ అనే నిక్‌నేమ్ కూడా ఉంది.
Also Read : హైడ్రా దూకుడు.. ఈరోజు భారీగా కూల్చివేతలు!
58 మంది మగ ఆఫీసర్లతో...
అయితే ఆమె తన చూపుల వలతో అనేక మందిని బుట్టలో వేసుకున్నట్లు ఓ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పదవిలో తనకన్నా చిన్నవారైన 58 మంది మగ ఆఫీసర్లతో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వారి వద్ద నుంచి ఆమె సుమారు 60 మిలియన్ల యువాన్లు లంచంగా తీసుకున్నట్లు ఆమె పై తీవ్ర ఆరోపణలు వినిపించాయి. 22 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరిన జాంగ్‌కు ఇప్పుడు 52 సంవత్సరాలు.
Also Read : అమెరికా అధ్యక్షునితో మోదీ భేటీ!
ప్రభుత్వ పెట్టుబడులు, అభివృద్ధి పేరు...
జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రస్తుతం డిప్యూటీ ర్యాంక్ హోదాలో ఉంది. రైతులకు సాయం చేసేందుకు ఫ్రూట్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్‌ను కూడా ఆమె ప్రారంభించింది. ప్రభుత్వ పెట్టుబడులు, అభివృద్ధి పేరుతో ఆమె మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోని కంపెనీలను ఆమె గాలికి వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్
భయపడి ..
క్రమశిక్షణా, చట్టపరమైన ఉల్లంఘనలకు జాంగ్ పాల్పడినట్లు గుజావ్ ప్రావిన్షియల్ కమిటీ తన తీర్పులో పేర్కొంది. 58 మంది మగ సిబ్బందితో ఆమె అఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె ఇచ్చిన ఆఫర్లను స్వీకరించిన వారు ఆమెకు ప్రేమికులుగా ఉండిపోయారు. కొందరు ఆమెకు భయపడి .. ఆమెకు లొంగిపోయారు. ఓవర్‌టైం వర్క్, బిజినెస్ ట్రిప్ పేర్లతో ఆమె తన ప్రియులతో సమయం గడిపేదని తేలింది. ఏప్రిల్ 2023లో ఆమెను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో పదవి నుంచి తొలగించారు.
Also Read : గర్ల్స్ హాస్టల్ బాత్రూంల్లో స్పై కెమెరాలు..గుడ్లవల్లేరు ఘటన రిపీట్!