Israel: ఐరాస ఛీఫ్‌ మా దేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదు–ఇజ్రాయెల్

ఇరాన్ తమ దేశంపై చేస్తున్న దాడులను ఖండించని వారు ఎవరైనా తమ దేశంలో అడుగుపెట్టేందుకు అర్హత లేదని ఇజ్రాయెల్ అంటోంది. ఈ క్రమంలో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్‌ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేదిస్తున్నట్లు ప్రకటించింది.  

author-image
By Manogna alamuru
New Update
uno

Israel Banned Guterres: 

ఇరాన్, ఇజ్రాయెల్‌లో డైరెక్ట్ వార్ కు దిగిపోయాయి ఇప్పుడు. హమాస్, హెజ్బుల్లా నేతలను చంపిందన్న కోపంతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద క్షిపణుల  వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ మండిపడుతోంది, ఇరాన్ దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిస్తోంది.  ఈ నేపథ్యంలో ఇరాన్ దాడిని ఖండించని వారు ఎవరైనా వారితో కట్టీ అంటోంది ఇజ్రాయెల్. ఇరాన్‌కు సపోర్ట్ చేసేవారు ఎవరైనా...వారికి తమ దేశంలో అడుగు పెట్టే అర్హత లేదని తేల్చి చెప్పింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ ప్రకటించారు. తమపై ఇరాన్‌ దాడి చేస్తే ఆయన దానిని ఖండించలేదని చెప్పారు.  ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు అండగా నిలుస్తున్నారని, ఐరాస చరిత్రపై ఆయనో మాయని మచ్చ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గుటెరస్‌ ఉన్నా.. లేకపోయినా.. ఇజ్రాయెల్‌ తన పౌరులను రక్షించుకుంటుందని, దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుందని కాట్జ్ అన్నారు.

మరవైపు ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహ మండిపడ్డారు. ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని..మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సమర్ధవంతంగా ఎదుర్కుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇందులో తమకు అండగా నిలిచిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

Also Read: Israel: హెజ్బుల్లాను అంతమొందించేందుకు ఎప్పటి నుంచో ప్లాన్

Advertisment
తాజా కథనాలు