ఈ ప్రపంచంలో చాలా రకాల డ్రింక్స్ ఉంటాయి. ఒక్కో డ్రింక్‌కు ఒక్కో ధర ఉంటుంది. సాధారణంగా రూ. 500 నుంచి అటు ఇటుగా 2000 రూపాయల వరకు ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత కాస్లీ డ్రింక్ ఉందన్న విషయం మీకు తెలుసా? ఈ డ్రింక్ పేరు లైవ్ ఫిష్ డ్రింక్. ఈ డ్రింక్ కప్పులో 200 చేపలు ఉంటాయి. పైగా చేపలన్నీ సజీవంగా ఉంటాయి.
Also read: రేపే హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
అయితే, ఈ లైవ్ ఫిష్ డ్రింక్ ఒక చిన్న 60ml కప్పుకు 5000 రూపాయలు ఉంటుందట. ఈ డ్రన్క్ ను డ్యాన్సింగ్ ఈటింగ్ అని కూడా పిలుస్తారు. అతి చిన్న సైజ్ లో ఉండే చేపల్ని, సోయా సాస్ తో మిక్స్ ఉన్న పదార్థాలతో కలిపి.. అవి సజీవంగా ఉన్నప్పుడే తాగుతారు. ఈ డ్రింక్ సేవిస్తున్నప్పుడు ఫిషెస్ కిందకు పడకుండా జాగ్రత్తగా తాగడమే ఆర్ట్ అంటున్నారు జపనీయులు.