/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బాఘెర్జదే కన్నుమూశారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు టెహ్రాన్‌పై జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కోమాలోకి వెళ్ళిన ఆమె చికిత్స పొందుతూ మార్చి 2న మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.
ఎవరీ మన్సౌరే ఖోజస్తే బాఘెర్జదే?
మన్సౌరే ఖోజస్తే బాఘెర్జదే 1947లో ఇరాన్‌లోని మషద్ నగరంలో ఒక సంప్రదాయ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ ఇస్మాయిల్ ఖోజస్తే బాఘెర్జదే ఆ ప్రాంతంలో ప్రముఖ వ్యాపారవేత్త. 1964లో ఆమెకు 17 ఏళ్ల వయసులో అలీ ఖమేనీతో వివాహం జరిగింది. అప్పట్లో ఖమేనీ ఇస్లామిక్ విప్లవ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేవారు. వారి వివాహ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగింది. వీరికి నలుగురు కుమారులు (ముస్తఫా, మొజ్తబా, మసౌద్, మీసమ్), ఇద్దరు కుమార్తెలు (బష్రా, హుదా) ఉన్నారు. వీరిలో మొజ్తబా ఖమేనీ రాజకీయంగా కొంత ప్రభావం ఉన్నప్పటికీ, మిగిలిన పిల్లలు బహిరంగ జీవితానికి దూరంగా ఉంటారు. ఇతర దేశాధినేతల భార్యల మాదిరిగా మన్సౌరే ఎప్పుడూ రాజకీయాల్లో లేదా బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆమె జీవితం పూర్తిగా గోప్యంగా ఉండేది. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం (1979) తర్వాత కూడా ఆమె తెర వెనుకే ఉండి భర్తకు మద్దతుగా నిలిచారు. 1993లో ఒక పత్రికకు ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూలో, తన భర్త పనిపై దృష్టి పెట్టేలా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడమే తన బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
మరణానికి దారితీసిన పరిస్థితులు
ఫిబ్రవరి 28, 2026న ఇజ్రాయెల్, అమెరికా జాయింట్‌గా టెహ్రాన్‌లోని ఖమేనీ కార్యాలయ సముదాయంపై క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల్లో అలీ ఖమేనీ అక్కడికక్కడే మరణించగా, మన్సౌరే తీవ్రంగా గాయపడ్డారు. ఆమెతో పాటు మరో కుమార్తె, మనవడు కూడా ఈ దాడుల్లో మరణించినట్లు సమాచారం.
Follow Us