Anura Kumara Disanayake..
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనుర కుమార దిసనాయకే ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లకే పరిమితమైన ఈయన, ఈసారి ఏకంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అనుర కుమార 1968 నవంబర్ 24న అనురాధపురం జిల్లాలోని తంబుతెగామలో పుట్టారు. తంబుతెగామ కామినీ మహా విద్యాలయం, తంబుతెగామ సెంట్రల్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత పెరదేనియా యూనివర్సిటీలో చేరారు. 19 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అనుర. శ్రఈలంకలో ఒక రాజకీయ పార్టీ అయిన జనతా విముక్తి పెరమునెలో జాయిన్ అయ్యారు. దీని కోసం తాను చదువుతున్న యూనివర్శిటీని కూడా మార్చుకున్నారు. ఆ తరువాత 1995లో, జేవీపీ ఈయన్ను సోషలిస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ఆర్గనైజర్‌గా నియమించింది. ఆ పార్టీ సెంట్రల్ వర్కింగ్ కమిటీలోనూ చోటు కల్పించింది. 2000లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన అనుర కుమార మొదటిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో జేవీపీ, శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో జేవీపీకి 39 సీట్లు వచ్చాయి. కురునాగల జిల్లా నుంచి అనుర కుమార గెలిచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. దీని తర్వాత శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, జేవీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వంలో వ్యవసాయం, పశుసంవర్థక, భూములు, నీటిపారుదల శాఖలకు మంత్రిగా అనుర కుమార బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయసు 28 ఏళ్ళు మాత్రమే. ఒకరకంగా ఇది ఒక కూడా ఒక రికార్డే అని చెప్పుకోవాలి. అనుర అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ చాలా కొద్ది కాలంలోనే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దానికి కారణం సునామీ తర్వాత శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఎల్టీటీఈతో కలిసి సహాయ చర్యలు చేపట్టాలని చంద్రిక కుమారతుంగ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. దీన్ని జేవీపీ వ్యతిరేకించింది. దాంతో ఆ పార్టీ మంత్రులంతా రాజీనామా చేశారు.
2014లో అనుర కొత్త బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి వరకు జేవీపీలో ఒక సభ్యుడుగా ఉన్న ఆయన ఆ పార్టీకే అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. దీని తర్వాత జేవీపీని దేశ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంచడంలో అనుర సక్సెస్ అయ్యారు. అయితే ఇది ఆయనకు పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు. 2019 ఎన్నికల్లో అనుర కుమార మొదటిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కేవలం 3శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగారు. జనతా విముక్తి పెరమునె నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ) కూటమి అభ్యర్ధిగా ఈయన పోటీ చేశారు.
అయితే 2019 ఎన్నికల ఓటమి అనుర కుమారను కృంగదీయలేదు. మరింత ఉత్సాహంతో, రాజకీయ చైతన్యంతో ఈయన పని చేశారు. రాజపక్స అవినీతిని ఎండగట్టడంలో అనుర కుమార సక్సెస్ అయ్యారు. దీని ద్వారా క్రమంగా ఆయనకు మద్దతు పెరుగుతూ వచ్చింది. దీంతో పాటూ శ్రీలంక ఆర్ధిక సంక్షోభ సమయంలో జరిగిన నిరసనల్లో కూడా అనుర యాక్టివ్‌గా పాల్గొన్నారు. అప్పుడే 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా అనౌన్స్ చేశారు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకేకు విపరీతంగా మద్దతు వచ్చింది. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆయన వెంట నడిచారు. ఎన్నికల ప్రచార సభలకు జనాలు విపరీతంగా వచ్చారు. అనుర బాగా చదువుకున్న వారు కావడం, ప్రజలకు కావాల్సి విషయాలు మాట్లాడడం లాంటివి ఆయన ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అదే కాక సొతంతగా తన పార్టీకి హింసాత్మక చరిత్ర ఉన్నప్పటికీ...2014లో శ్రీలంకలో జరిగిన హింసకు ఆయన క్షమాపణలు చెప్పారు. తన పార్టీ గురించి కూడా ఆయన ఇందులో మాట్లాడారు. ఇలా చేసిన మొదటి నాయకుడు ఆయనే కావడం గమనార్హం. ఇది కూడా అనుర పట్ల ప్రజల్లో పాజిటివిటీని పెంచింది. మిగతా నాయకులతో పోలిస్తే అనుర ప్రజల నాడిని నిశితంగా పరిశీలిస్తారు. దానికి ఉదాహరణే..శ్రీలంక తమిళుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈశాన్య ప్రాంతాల్లో పర్యటించిన అనుర కుమార జాఫ్నాలో ప్రసంగించారు. ఇందులో ఆయన 13వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తా. సమాఖ్య విధానం అందిస్తా అని చెప్పారు. ఇది తమిళ వర్గాల్లో నిరాశ కలిగించింది. అయితే ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ అనుర కుమార తన పంథా కాస్త మార్చుకుని..జూన్‌లో మరోసారి జాఫ్నా వెళ్లిన అనుర తమిళ రాజకీయ నేతలను కలిశారు. దాని తర్వాత అనుర మాట్లాడుతూ ప్రావిన్షియల్ కౌన్సిల్స్ యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. తన పార్టీ దీనికి వ్యతిరేకం అని తెలిసినా కూడా ఆయన ఈ ప్రమిస్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరి ఏం చేస్తారో చూడాలి.
అదానీ ప్రాజెక్టు మీద వ్యతిరేకత...
శ్రీలంకలో ఉన్న అదానీ విండ్ అండ్ పవర్ ప్రాజెక్టను రద్దు చేస్తామని అనుర కుమార చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈశాన్య ప్రాంతాల్లో పర్యటించిన అనుర కుమార జాఫ్నాలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ''13వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తా. నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇక్కడకు రాలేదు. సమాఖ్య విధానం అందిస్తా. నాకు ఓటేయమని అడగడానికి ఇక్కడకు రాలేదు'' అన్నారు. ఇది తమిళ వర్గాల్లో నిరాశ కలిగించింది.
అయితే, ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ అనుర కుమార తన పంథా కాస్త మార్చుకున్నారు. శ్రీలంకకు ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించనున్న ఈ ప్రాజెక్టుకి తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. అలాగే, ఈ ప్రాంతంలోని ఏ వ్యవస్థతోనూ విరోధం ఉండదని జేవీపీ పార్టీ ముందు నుంచే చెబుతూ వస్తోంది. ప్రస్తుతం శ్రీలంకకు ఇండియా, చైనా భారీగా రుణాలిస్తున్నాయి. ఇందులో చైనా వామపక్ష భావజాలం ఉన్న దేశం. అనుర కుమార పార్టీ అయిన జేవీపీ కూడా వామపక్ష భావజాలం ఉన్నదే. అందుకే ఈ పార్టీ, కొత్త అధ్యక్షుడు భారత్ కన్నా చైనాకే ఎక్కువ అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే అదానీ పార్టీని వ్యతిరేకించడం అనే టాక్ ఉంది. దాంతో పాటూ ప్రావిన్సులకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పే ఇండియా - శ్రీలంక ఒప్పందాన్ని జేవీపీ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది.
Also Read: Bengaluru: వణికించిన బెంగళూరు హత్య..హంతకుడు బెంగాల్‌లో!