Open AI: నా కొడుకుని ఓపెన్ ఏఐ నే చంపేసింది!

చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ విజిల్‌ బ్లోయర్, భారత సంతతి వ్యక్తి సుచిర్‌ బాలాజీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పై బాలాజీ అమ్మ పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు.ఓపెన్‌ ఏఐ సంస్థ తన కొడుకుని హత్య చేసిందన్నారు.

New Update
open ai

open ai

చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐలో నాలుగేళ్లు పరిశోధకుడిగా పనిచేసిన విజిల్‌ బ్లోయర్, భారత సంతతి వ్యక్తి సుచిర్‌ బాలాజీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై బాలాజీ అమ్మ పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు.ఓపెన్‌ ఏఐ సంస్థ తన కుమారుడిని హత్య చేసిందని పేర్కొన్నారు.

Also Read: RC16: RC16 నుంచి జగపతి బాబు లుక్ లీక్.. వీడియో వైరల్! బుచ్చిబాబు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్

ఓపెన్‌ ఏఐకి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని, వారు ఏమి చేస్తున్నారనే విషయాలు అతడికి తెలుసని చెప్పారు. తమ రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉండాలనే కారణంతోనే తన కొడుకుని చంపేశారని ఆమె ఆరోపించారు.

అమెరికాలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కుమారుడి మరణం, ఏఐ కు సంబంధించిన పలు విషయాలను బయటపెట్టారు.'' నా కుమారుడు చనిపోవడానికి ఒక్కరోజు ముందే పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. ఒక వేళ తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ వేడుకలు జరుపుకొనే వాడా? తనకు ఆ ఉద్దేశం ఉంటే తన తండ్రి పంపించిన గిఫ్ట్స్‌ ను ఎందుకు అందుకుంటాడని ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.

Also Read: APSRTCకి భారీ లాభాలు.. సంక్రాంతికి కాసుల పంట

ఓపెన్‌ ఏఐకి వ్యతిరేకంగా నా కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయి. అందుకే దాడి చేసి చంపారు తను చనిపోయాక కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదు. న్యాయవాదులు సైతం దీన్ని ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. కేవలం 14 నిమిషాల వ్యవధిలోపే తన కుమారుడి మృతిని ఆత్మహత్యగా అధికారులు తేల్చారని ఆమె చెప్పుకొచ్చారు.

అధికారులు పూర్తి సమాచారం తెలపడం లేదని, వాళ్లుపారదర్శకంగా వ్యవహరించట్లేదన్నారు. కాగా ఈ ఇంటర్వ్యు పోస్టును మస్క్‌ ఎక్స్‌ లో పోస్టు చేశారు. బాలాజీ మృతి పై అతని తల్లి పూర్ణిమ రావు న్యాయపోరాటానికి దిగారు. తన కుమారుడి మృతి పైఅనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేటర్ ను నియమించుకొని రెండోసారి శవపరీక్ష నిర్వహించారు.

ఇది ఆత్మహత్యలా..

అయితే ఈసారి రిజల్ట్స్‌ భిన్నంగా వచ్చాయి. బాత్రూం లో ఘర్షణ ఆనవాళ్లు, రక్తపు మరకలు,దొంగతనం జరిగినట్లు తెలిసింది. కానీ అధికారులు మాత్రం ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారు. మాకు న్యాయం జరగాలి. దీని పై ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె కోర్టను కోరారు. మస్క్‌ దీని మీద స్పందిస్తూ ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదని తెలిపారు.

Also Read: Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Also Read: Horoscope: నేడు ఈ రాశివారికి అనుకున్న పని పూర్తి అయిపోతుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు