Iran: మరింత విషమించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం!

ఇరాన్ సుప్రీం నేత తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆయనకు గతవారం ఇంటిలోనే వైద్యులు సర్జరీ చేశారు. తీవ్రమైన కడుపునొప్పి, తీవ్ర జ్వరంతో ఖమేనీ బాధపడుతున్నారు.

New Update
khameni 2

Iran : గతవారం అస్వస్థతకు గురైన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం మరింత విషమించింది. తీవ్రమైన కడుపునొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఆయనకు అధికారిక నివాసంలో చికిత్స కొనసాగుతోంది. అత్యాధునిక వైద్యసదుపాయాలను అమర్చి ఖమేనీకి వైద్యులు శస్త్రచికిత్స ను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షిణించినప్పటి నుంచి కూడా నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని రేయింబవళ్లూ పర్యవేక్షిస్తోంది. 

Also Read : ఆ 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం!

ఈ మేరకు ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన ఉన్న నలుగురు వ్యక్తులను గురించి తెలుపుతూ పలు వార్తా సంస్థలు కొన్ని కథనాలు వెల్లడించాయి. వారిలో ఇద్దరు ఇరాన్‌కు చెందిన అధికారులే.  కాగా.. ఒకరికి ఆ దేశ సైన్యం రివల్యూషనరీ గార్డ్స్‌తో సంబంధాలున్నాయి. గతవారం మరింత ఆందోళనకరంగా ఉన్న ఖమేనీ ఆరోగ్యం ఇప్పుడు కొంత మెరుగుపడినప్పటికీ, మంచంపై లేచి కూర్చోలేనంత నీరసంగా ఉన్నారని ఆ నలుగురు వ్యక్తుల్లో ఒకరు వెల్లడించారు.

Also Read: పవన్‌ది మూర్ఖత్వం.. విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు!

 ఖమేనీ శనివారం యూనివర్సిటీ విద్యార్థులతో జరిగే ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయిని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఆయన ఉన్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగిందా? లేదా? అన్న విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

ఖమేనీ రెండో కుమారుడు..

1989లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ రుహోల్లా ఖొమేనీ మృతితో ఆయన వారసుడిగా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనారోగ్యం బారినపడిన ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వారసుడెవరనే విషయమై చర్చ జరుగుతోంది. ఖమేనీ వారసుడిగా భావించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. దీంతో ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబా (55) ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Also Read:  ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం!

ఇజ్రాయేల్‌ ప్రతీకార దాడులకు ఎలా స్పందించాలనే దానిపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రచారం మొదలైంది. దీనిపై ఇరాన్‌ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే, తాము ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయకూడదని భావిస్తున్నట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు. మిత్రపక్షాల శక్తి సన్నగిల్లడం, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినడం, ఖమేనీ ఆరోగ్యం విషమించడంతో వారసుడి ఎంపిక వంటి ఇబ్బందులతో ఇరాన్ డైలామాలో ఉంది. 

ఈ క్రమంలో గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణను సూచిస్తూ ఇరాన్ సైన్యం శనివారం రాత్రి ఓ ప్రకటన లో తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఎలాంటి ప్రతీకారం తీర్చుకునే హక్కు దానికి ఉందని చెబుతూనే.. దీనిపై ఓ మార్గాన్ని కనుగొనడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆ ప్రకటనలో తెలిపింది. తమపై దాడులకు చాలా తేలికైన వార్ హెడ్‌లను మోసుకెళ్లే స్టాండాఫ్ క్షిపణులను ఉపయోగించిందని పేర్కొంది. ఈ దాడుల్లో తమ సైనిక రాడార్ స్థావరాలు దెబ్బతిన్నాయని, కొన్ని ఇప్పటికే మరమ్మతులో ఉన్నాయని ప్రకటించింది.

Also Read:  జనాభా లెక్కలు... 2028లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన!

Advertisment
తాజా కథనాలు