Russia: అంతా ఉత్తిదే..పుతిన్‌కు ట్రంప్ అసలు ఫోన్ చేయలేదు

అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత నుంచి రష్యా–ఉక్రెయిన్, పశ్చిమాసియా దేశాల యుద్ధాల గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ కాల్ చేశారన్న వార్త వచ్చింది. కానీ అదంతా కల్పితమేనని అంటున్నారు. 

r
New Update

Putin, Trump call: 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పెంచడానికి వీలు లేదని ట్రంప్ సూచించినట్టు సమాచారం. ఎన్నికల్లో విజయం సాధించిన రెండు రోజుల తర్వాత ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్ నుంచి పుతిన్‌కు ఫోన్ చేశారని నివేదికలు తెలిపాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‎కు ఫోన్ కాల్ చేసిన ట్రంప్.. ఉక్రెయిన్‎తో ఇక యుద్ధానికి ముగింపు పలకాలని.. సమస్యను తీవ్రతరం చేయవద్దని సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. 

అయితే అదంతా నిం కాదని అంటోంది రష్యా ప్రభుత్వం. పుతిన్ తో ట్రంప్ మాట్లాడలేదని తేల్చి చెప్పారు. యుద్ధంపై పుతిన్- ట్రంప్ చర్చించినట్లు జరుగుతోన్న  ప్రచారమంతా కల్పితమని కొట్టిపారేసింది. ఇది పూర్తిగా అవాస్తవం. తప్పుడు సమాచారంతో కూడిన కల్పితమని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాకు తెలిపారు. అసలు ట్రంప్‌తో మాట్లాడేందుకు పుతిన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కథనాలు వెలువరించిన వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ సంస్థలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిసార్లు పేరున్న సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. తాను గెలిస్తే ఒక్కరోజులోనే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని పేర్కొన్న విషయం తెలిసిందే. 

Also Read: IAS Officers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ..

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe