Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం...36మంది మృతి ఉత్తరాఖండ్ లో ఘర ప్రమాదం జరిగింది. అల్మోరా జిల్లాలో అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది అక్కడిక్కడే చనిపోగా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. By Manogna alamuru 05 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Big Accident: ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కు చేరింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. నిన్న ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బస్సు గర్వాల్ నుంచి రాంనగర్‌కు వెళ్తుండగా అల్మోరాలోని కూపి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో అక్కడిక్కడికే 28 మంది మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని వాయుమార్గంలో తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బస్సు ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటనతో సంబంధం ఉన్న వారిని సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Also Read: Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి