BREAKING: దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిన అమెరికా ఫైటర్ జెట్లు

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు కేవలం అరగంట వ్యవధిలో కూలిపోవడం కలకలం సృష్టించింది. సాధారణ గస్తీ విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న MH-60R సీ హాక్ హెలికాప్టర్, F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ సముద్రంలో పడిపోయాయి.

New Update
US Navy In South China Sea

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు కేవలం అరగంట వ్యవధిలో కూలిపోవడం కలకలం సృష్టించింది. సాధారణ గస్తీ విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న MH-60R సీ హాక్ హెలికాప్టర్, F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ సముద్రంలో పడిపోయాయి. అయితే, ఈ ఘటనల్లో సిబ్బంది ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అమెరికా నౌకాదళం పసిఫిక్ ఫ్లీట్ ధృవీకరించింది. ఆదివారం (అక్టోబర్ 26, 2025) స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో, USS నిమిట్జ్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ నుంచి బయలుదేరిన MH-60R సీ హాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్ర జలాల్లో కూలిపోయింది. హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బందిని సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా రక్షించాయి.

ఈ ఘటన జరిగిన సుమారు 30 నిమిషాల తర్వాత, అంటే 3:15 గంటలకు, అదే 'యూఎస్ఎస్ నిమిట్జ్' నుంచి బయలుదేరిన F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ కూడా సముద్రంలో కూలిపోయింది. జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్‌లు ప్రమాదానికి ముందు సురక్షితంగా బయటకు దూకి రెస్క్యూ సిబ్బందికి చిక్కారు. ప్రమాదానికి గురైన ఐదుగురు సిబ్బంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే, వరుసగా జరిగిన ఈ రెండు ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకునేందుకు నౌకాదళం ప్రస్తుతం విచారణ చేపట్టింది. వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా నౌకలు, విమానాల కార్యకలాపాలు చైనాకు ఆందోళన కలిగిస్తుంటాయి. ఈ సమయంలోనే ఈ రెండు ప్రమాదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisment
తాజా కథనాలు