ఈ వీకెండ్ లో నా అరెస్ట్.. బెయిల్ కూడా వద్దు..ఏసీబీ కేసుపై కేటీఆర్ స్పందన

అన్నిటికీ సమాధానం చెబుతా అంటున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్‌లో స్కామ్ జరిగింది అంటున్నారు...ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. దీన్ని అసెంబ్లీలో చర్చించాలి అన్నారు. తనను వీకెండ్ లో అరెస్ట్ చేయాలని..బెయిల్ కూడా వద్దని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.

author-image
By Manogna alamuru
New Update
KTR PIC

ఫార్మలాఈ కార్ రేస్ నిర్వహణలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కస నమోదు చేసింది. దీనిపై ఆయ స్పందించారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చించుకుందాం రండి అటూ సవాల్ విసిరారు కేటీఆర్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై శాసనసభలో చర్చ పెట్టాలి అన్నారు కేటీఆర్.  ఫార్ములా రేస్ గురించి అన్ని విషయాలను వాస్తవంగా వివరిస్తా అని చెప్పారు. ఈ వీకెండ్‌లోనే నన్ను అరెస్ట్ చేయండి..బెయిల్ కూడా వద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అక్కడికి భారీగా పోలీసు బలగాలను తరలిస్తున్నారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా బలగాలను మోహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌కు సంబంధించిన కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్?

Advertisment
తాజా కథనాలు