/rtv/media/media_files/2025/01/20/trFgvurKd6tNrcDMGCcr.jpg)
Trump likely to sign 100 executive orders Photograph: (Trump likely to sign 100 executive orders)
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికాలో ఉదయం 11 గంటలకు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తే భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలు అవుతుందన్న మాట. అమెరికాలో చలి తీవ్రత కారణంగా క్యాపిటల్ హిల్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించనున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వాషింగ్టన్ అంతటా భద్రతను అక్కడి పోలీసులు కట్టుదిట్టం చేశారు.ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ వైట్‌హౌస్‌కు చేరుకోగానే 100 ఫైళ్లపై సంతకం చేయవచ్చు అని తెలుస్తోంది. వీటిలో చాలా వరకు ఆయన నెరవేర్చాల్సిన ఎన్నికల హామీలే ఉన్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే రికార్డు సృష్టించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ రోజున ఆయన రికార్డు స్థాయిలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ట్రంప్ సంతకం చేయబోయే ఫైల్స్ వాస్తవానికి కార్యనిర్వాహక ఆదేశాలుగా ఉంటాయి. వీటికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. అయితే ఈ నిర్ణయాలను కోర్టులో సవాలు చేయవచ్చు. ఈ ఆదేశాలలో దేశం దక్షిణ సరిహద్దును మూసివేయడం, సామూహిక బహిష్కరణ, మహిళల క్రీడా పోటీలలో లింగమార్పిడిని నిరోధించడం , టారిఫ్‌లకు సంబంధించినవిగా ఉండవచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా 2021 జనవరి 6న అమెరికా పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన నిందితులకు క్షమాభిక్ష కూడా ఇందులో ఉండవచ్చునని తెలుస్తోంది. ఇక బిడెన్ పరిపాలన విధానాలను రద్దు చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బైడెన్ అధ్యక్షుడైన తొలివారంలో 22 ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
కమలా హారిస్ పై ట్రంప్ ఘన విజయం
దేశానికి సేవ చేయడమే తన ధ్యేయమని, దాని కోసం ఎటువంటి చర్య తీసుకోవడానికైనా వెనుకాడనని ట్రంప్ పలుమార్లు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. "పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే నేను డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లపై సంతకం చేస్తాను, ఖచ్చితంగా చెప్పాలంటే అవి 100కి దగ్గరగా ఉంటాయి" అని ట్రంప్ ఆదివారం క్యాండిల్‌లైట్ డిన్నర్‌లో మద్దతుదారులతో అన్నారు. కాగా గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ డెమోక్రటిక్ నేత కమలా హారిస్ పై ట్రంప్ ఘన విజయం సాధించారు.
Also Read : BIGG BOSS Tamil Season 8: జాక్ పాట్ కొట్టేశాడు.. తమిళ బిగ్ బాస్ 8 విజేతగా యూట్యూబర్