/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T143511.935.jpg)
జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీని కోసం ఆయన అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తోంది. క్రితంసారి కంటే ఈసారి మరింత దూకుడుగా పని చేయాలని ట్రంప్ భావిస్తున్నారని తెలుస్తోంది. అమెరికాలో చాలా మార్పులకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ నంబర్ వన్‌ను మరింత స్ట్రాంగ్‌గా నిలబెట్టాలని ట్రంప్ ఆలోచిస్తున్నారని సమాచారం. తన కార్యవర్గ సభ్యుల ఎంపికపై ఇప్పటికే దృష్టి సారిస్తూ..చాలామంది పేర్లను ప్రకటించారు. దీంతో పాటూ ఇప్పుడు తాను అధ్యక్షుడు అయిన మొదటిరోజే ఏ ఫైళ్ళపై సంతకం చేయాలనేది కూడా డిసైడ్ అయ్యారుట. వచ్చే నెలలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిరోజే దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నవారు ట్రంప్. ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలపై ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
అన్నింటిలో మార్పులు..
2021లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ మొదటి రోజు 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. ఇప్పుడు దానిని మించిపోతూ ట్రంప్ ఏకంగా 25 ఆర్టర్లను పాస్ చేయనున్నారు. ఇందులో సరిహద్దు విధానాలకు సంబంధించి బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా-మెక్సికో సరిహద్దుకు అదనపు బలగాలను తరలించడం, సరిహద్దు గోడను పునర్నిర్మించడం వంటి వాటిపై ట్రంప్ ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. వీటితో పాటూ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేయనున్నట్లు చెబుతున్నారు.
Also Read: IRAN: హిజాబ్ ధరించకపోతే ఉరిశిక్ష–ఇరాన్ లో కొత్త చట్టం