Trump Vs Netanyahu:
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు వస్తున్న రివ్యూల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే గెలుస్తారని అంచనాలు వస్తున్నాయి. ట్రంప్ కూడా తానే గెలుస్తానని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. తాను అధ్యక్షుడు అయ్యే నాటికి ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని ముగించాలని సూచించారు. గాజాను ఖాళీ చేయాలని చెప్పారు. గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్ ప్రతిపాదించారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన వివరాలను టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ లో కథనాలు వచ్చాయి.
మరోవైపు ఇజ్రాయెల్‌పై భారీ దాడులకు ఇరాన్ స్కెచ్ వేస్తోంది. అమెరికా ఎన్నికలకు ముందు భారీ దాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్న అమెరికాపై కోపంతో రగిలిపోతున్న ఇరాన్.. సరిగ్గా ఎన్నికల ముందు అణుబాంబు దాడులు చేసి భారీ దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా, ఆర్థికంగా అండగా నిలుస్తోంది. దీంతో ఎన్నికల ముందు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తే.. ఇజ్రాయెల్‌కు సహకరించిన డెమోక్రటిక్ పార్టీకి డ్యామేజ్ అవుతుందని ఇరాన్ భావిస్తోంది.
Also Read: IT:TCS ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇక 15 ఏళ్ల పాటు నో టెన్షన్!