వెనిజులా, ఇరాన్ తర్వాత.. అమెరికా నెక్ట్స్ టార్గెట్ ఆ దేశామే: ట్రంప్ షాకింగ్ కామెంట్స్

ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల తర్వాత ఇప్పుడు ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. "క్యూబా ప్రభుత్వంతో మేము చర్చలు జరుపుతున్నాం.. బహుశా మేము క్యూబాను 'ఫ్రెండ్లీ టేకోవర్' చేసుకునే అవకాశం ఉంది" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి.

New Update
Trump threatens Iran with ‘hell’ if it kills protesters, declines to meet the Shah’s son

Trump threatens Iran with ‘hell’ if it kills protesters, declines to meet the Shah’s son

ఇరాన్ తర్వాత అమెరికా నెక్ట్స్ టార్గెట్ క్యూబానేనా? ప్రస్తుతం ఇరాన్‌పై ఆర్మీ ఆపరేషన్ చేస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు క్యూబాలో 'పాలన మార్పు' దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో విదేశాంగ విధానాన్ని అత్యంత దూకుడుగా అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2026 చివరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా జరిపిన దాడుల తర్వాత ఇప్పుడు ట్రంప్ ఫోకస్ క్యూబాపై పడింది. "క్యూబా ప్రభుత్వంతో మేము చర్చలు జరుపుతున్నాం.. బహుశా మేము క్యూబాను 'ఫ్రెండ్లీ టేకోవర్' చేసుకునే అవకాశం ఉంది" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. 

క్యూబా దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పాలనలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం క్యూబాను ఫేల్యూర్ కంట్రీగా అభివర్ణిస్తూ, అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. వెనిజులాలో నికోలస్ మదురోను జనవరి 2026లో అమెరికా బంధించిన తర్వాత, క్యూబాకు అందే చమురు సరఫరా నిలిచిపోయింది. దీనికి తోడు మెక్సికో వంటి దేశాల నుంచి క్యూబాకు చమురు పంపకుండా ట్రంప్ టారిఫ్ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం క్యూబా తీవ్రమైన విద్యుత్ కోతలు, ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని క్యూబా పాలనను మార్చాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్-కానెల్ ఈ చర్యలను "అమెరికా సామ్రాజ్యవాదం"గా కొట్టిపారేస్తున్నారు. 

ట్రంప్ వ్యాఖ్యల వెనుక రహస్యం
ట్రంప్ తన విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (క్యూబన్-అమెరికన్ సంతతికి చెందిన వ్యక్తి) ద్వారా క్యూబా ప్రభుత్వంతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. "ఇరాన్ సమస్య ముగిసిన వెంటనే మా తర్వాత స్పెషల్ టార్గెట్ క్యూబానే" అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది ఇరాన్ తరహాలో బాంబు దాడులా లేక ఆర్థిక ఒత్తిడితో కూడిన ఒప్పందమా అనేది స్పష్టత లేదు.  
క్యూబా ఆక్రమణ వెనుక కారణాలు.. 

అమెరికా భద్రత: క్యూబాలో రష్యా, చైనా వంటి ప్రత్యర్థుల ప్రభావం పెరగడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది.
వలసల సమస్య: క్యూబాలో సంక్షోభం ఏర్పడితే వేలాది మంది అమెరికాకు వలస వచ్చే అవకాశం ఉంది.
పాలన మార్పు: కమ్యూనిస్ట్ పాలనను అంతం చేసి, అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా లాటిన్ అమెరికాపై పట్టు సాధించాలని ట్రంప్ యోచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు