Donald Trump : అమెరికాలో కాల్పులు..ట్రంప్‌ నకు సమీపంలోనే ఘటన!

అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు అతి సమీపంలో కాల్పులు జరిగాయి.ప్రచారం ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ఆయన...గోల్ఫ్‌ ఆడుతుండగా క్లబ్‌ వద్ద ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడాన్ని గమనించిన సిబ్బంది కాల్పులు జరిపి అతడ్ని పట్టుకున్నారు.

author-image
By Bhavana
New Update
trump

Donald Trump : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు అతి సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌ లోని తన గోల్ణ్‌ కోర్టులో ట్రంప్ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో తిరిగాడు. 

సురక్షిత ప్రాంతానికి…

దీంతో ఆ వ్యక్తి పై సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. దీంతో ట్రంప్‌ ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు పేర్కొన్నారు.

ఓ వ్యక్తి ఆయుధంతో…

ట్రంప్‌ కు గోల్ఫ్‌ ఆడే అలవాటు ఉంది. ఆయన ఉదయం నుంచి మధ్యాహ్న భోజనానికి ముందుకు వరకు వెస్ట్‌ పామ్‌ బీచ్‌ లోని తన గోల్ఫ్‌ కోర్టులో గడుపుతారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ఆయన…ఆదివారం గోల్ఫ్‌ ఆడుతుండగా గోల్ఫ్‌ క్లబ్‌ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు.

వెంబడించి అతడ్ని..

ఆ సమయంలో గోల్ఫ్‌ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్‌యూవీలో పారిపోయాడని , పోలీసులు వెంబడించి అతడ్ని పట్టుకున్నట్లు తెలిపారు.

కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏకే 47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్‌ ను లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులు జరిగాయా? అనే విషయం పై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు తెలిపారు.

Also Read: AP News: ఏపీలో కొత్త మద్యం పాలసీ.. 19న కొత్త దుకాణాలకు నోటిఫికేషన్!

Advertisment
తాజా కథనాలు