North Korea: చెత్త చెలగాటం..విమానాశ్రయాల మూసివేత! ఉత్తర కొరియా పంపించే చెత్త బెలూన్లను తొలుత చిన్న సమస్యగానే అనుకున్నప్పటికీ అది రానురాను దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారింది. ఇచియాన్, గింపో ఎయిర్ పోర్టుల్లో కొన్నింటిని మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. By Bhavana 25 Sep 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Trash Balloons : ఉత్తర కొరియా పంపించే చెత్త బెలూన్లను తొలుత చిన్న సమస్యగానే అనుకున్నప్పటికీ అది రానురాను దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారింది. ఆ బెలూన్ల కారణంగా జూన్ నుంచి తమ రాజధాని సియోల్ కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని రన్ వే లను పలుమార్లు మూసేయాల్సి వచ్చిందని ఆ దేశ చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్ పోర్టుల్లో కొన్ని లేదా మొత్తం రన్ వేలను దాదాపు 20 రోజుల్లో మూసివేయాల్సి వచ్చిందని ఆ దేశ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు యంగ్ బూ నామ్ పేర్కొన్నారు. ఆ సమయంలో టేకాఫ్ లు, ల్యాండింగ్ లు సమస్మాత్మకంగా మారాయని తెలిపారు. మొత్తంగా ఆరు గంటలకు పైగా తమ వైమానికి సేవలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇచియాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్ పోర్టుల్లో ఐదో స్థానంలో నిలుస్తుంది. మే చివరి వారంలో నుంచి ఉత్తరకొరియా వేల సంఖ్యలో చెత్త నింపిన బ్యాగ్ లు కట్టిన బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. తాజాగా వీటి సంఖ్య 5,500 దాటేసిందని అంచనా. ఈ బుడగలు ఒక దేశాధ్యక్షుడి నివాస ప్రాంగణంలో కూడా ఈ చెత్త బెలూన్లు కూలి సంచలనం సృష్టించాయి. మరోసారి ఎయిర్‌పోర్ట్ రన్ వే పై పడటంతో అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఒక్క జూన్ 26 వ తేదీనే ఏకంగా ఇచియాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ రన్ వే ను దాదాపు మూడు గంటలు మూసివేయాల్సి వచ్చింది. ఇదే ఎయిర్ పోర్టులో సోమవారం మరో 90 నిమిషాల అంతరాయం ఏర్పడింది. ఉత్తర కొరియా చెత్త బెలూన్ల కారణంగా ల్యాండింగ్ ఆలస్యం, మార్గం మళ్లింపు భయాలతో అత్యధిక ఇంధనాన్ని విమానాలు తీసుకెళ్లాల్సి వస్తోంది. Also Read : జగన్‌కు రేవంత్ షాక్... కాంగ్రెస్‌లోకి ఆర్.కృష్ణయ్య! #north-korea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి