Explainer: ట్రంప్ ప్రాణాలకు డేంజర్.. Air Force One ఫ్లైట్ ఎందుకు వెనక్కు వచ్చింది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెను ప్రమాదం తప్పింది. జనవరి 20 రాత్రి ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు బయలుదేరారు. ట్రంప్ విమానం గాల్లోకి ఎగిరిన అరగంట తర్వాత తిరిగి మళ్లీ ల్యాండ్ అయ్యింది.

New Update
trump flight

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెను ప్రమాదం తప్పింది. జనవరి 20 రాత్రి ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు బయలుదేరారు. ట్రంప్ విమానం గాల్లోకి ఎగిరిన అరగంట తర్వాత తిరిగి మళ్లీ ల్యాండ్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు అధికారిక పర్యటనలకు ఉపయోంగించే 'ఎయిర్ ఫోర్స్ వన్'కు చెందిన బోయింగ్ 747 ఫ్లైట్‌లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఉన్నటుంది విమానంలో అన్నీ లైట్లు ఆగిపోయాయి. దీంతో ట్రంప్ సెక్యురిటీ సిబ్బంది, పైలట్లు అప్రమత్తమైయారు. వెంటనే ఫ్లైట్‌ను వెనక్కి తిప్పి మంగళవారం రాత్రి 11 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తర్వాత మరో విమానం ఎయిర్ ఫోర్స్ C-32లో దావోస్ బయలుదేరాడు.

ట్రంప్ ప్రయాణాలకు రెండు రకాల విమాలను వినియోగిస్తారు. వ్యక్తిగత ప్రయాణాలకు 'ట్రంప్ ఫోర్స్ వన్', అధికారిక పర్యటలకు 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానాలను వాడుతారు. ఈ 'ఎయిర్ ఫోర్స్ వన్' ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, సురక్షితమైన విమానంగా చెబుతారు. దీనిని 'గాల్లో ప్రయాణించే వైట్ హౌస్' అని కూడా పిలుస్తారు. అలాంటి విమానంలో టెక్నికల్ ఇష్యూ తలెత్తడం వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానం ట్రంప్‌కు గిఫ్ట్‌గా వచ్చింది. 2025 మేలో ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటనలో ఖతార్ రాజకుటుంబం(ప్రభుత్వం) ఈ విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చింది. ఇందులో ఉండే రాజభోగాల కారణంగా దీన్ని 'ఎగిరే ప్యాలెస్' అని పిలుస్తున్నారు.

బోయింగ్ 747-8 గాల్లో ఎగిరే ఇంద్రభవనం

ఇది అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747-8 జంబో జెట్. ఈ విమానం విలువ సుమారు $400 మిలియన్లు (భారత కరెన్సీలో దాదాపు 3,400 కోట్లు) ఉంటుందని అంచనా. ఈ విమానంలో మూడు అంతస్తులు ఉంటాయి. మొత్తం 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ట్రంప్ ఆఫీస్‌తోపాటు లగ్జరీ బెడ్‌రూమ్‌లు, విశాలమైన లాంజ్‌లు, మీటింగ్‌ హాళ్లు, హై లెవల్ డైనింగ్ ఏరియాలు ఉన్నాయి. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, అధ్యక్షుడు విమానం నుండే దేశాన్ని పాలించేలా అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. విమానంలో ఒక మినీ ఆపరేషన్ థియేటర్ కూడా ఉంటుంది. ఎప్పుడూ ఒక డాక్టర్ ట్రంప్‌తో పాటే ఉంటారు. విమానంలోని రెండు కిచెన్‌లో ఒకేసారి 100 మందికి భోజనం తయారు చేసే సౌకర్యం ఉంది.

హై లెవల్ సేఫ్టీ

శత్రువులు దీనిపై మిస్సైల్ దాడి చేస్తే, వాటిని దారి మళ్లించడానికి ఇందులో 'జామర్లు', 'ఫ్లేర్స్' వంటి డిఫెన్స్ సిస్టమ్‌ ఉంది. న్యూక్లియర్ బాంబ్ పేలినప్పుడు వెలువడే విద్యుదయస్కాంత తరంగాల నుంచి విమానంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా స్పెషల్ రక్షణ కవచం ఉంది. ఎమర్జెన్సీ అయితే ఈ విమానం కిందకు దిగకుండానే గాల్లో ఉండగానే మరో విమానం ద్వారా ఇంధనాన్ని నింపుకోగలదు. దీనివల్ల ఇది ఎంత కాలమైనా గాల్లోనే ఉండగలదు. ఖతార్ రాజకుటుంబం దీనిని తమ వ్యక్తిగత పర్యటనల కోసం వాడేవారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానాలు పాతబడిపోవడంతో, కొత్త విమానాల తయారీలో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఖతార్ ప్రభుత్వం ఈ విమానాన్ని ట్రంప్‌కు ఆఫర్ చేసింది. ఈ విమానాన్ని ట్రంప్ తన పదవీకాలం ముగిసే వరకు (2029 జనవరి) 'తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్'గా ఉపయోగిస్తారు. ఆ తర్వాత దీనిని ఆయన ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ఫౌండేషన్‌కు బదిలీ చేస్తారు. 

పర్సనల్ టూర్స్‌కు 'ట్రంప్ ఫోర్స్ వన్'

అధ్యక్షుడిగా కాకుండా వ్యక్తిగత పర్యటనల కోసం ట్రంప్ తన సొంత బోయింగ్ 757 విమానాన్ని ఉపయోగిస్తారు. దీనిని 'ట్రంప్ ఫోర్స్ వన్' అని పిలుస్తారు. ఇది ఎయిర్ ఫోర్స్ వన్ కంటే చిన్నదైనా, చాలా విలాసవంతంగా ఉంటుంది. దీని లోపల సీటు బెల్టులు, వాష్ బేసిన్లు, ఇతర వస్తువులు 24 క్యారెట్ల బంగారంతో పూత పూయబడి ఉంటాయి. ఇందులో అత్యున్నత స్థాయి థియేటర్ సిస్టమ్, లగ్జరీ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి.

కొత్త విమానాల రాక

ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు వాడుతున్న రెండు ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలు దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటివి. ఇవి పాతబడిపోవడంతో, వాటి స్థానంలో అత్యాధునిక బోయింగ్ 747-8 (VC-25B) విమానాలను సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త విమానాలు 2026 -2027 నాటికి అందుబాటులోకి రానున్నాయి.  వీటి స్థానంలో కొత్త విమానాలను తీసుకురావడంలో జరుగుతున్న జాప్యంపై ట్రంప్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు