తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసకుంది. గాంధీ భవన్‌లో కొద్దిసేపటి క్రితం కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటూ మంత్రులందరూ పాల్గొన్నారు. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
అరెస్ట్ తప్పదు..
వీటితో పాటూ కేబినెట్‌లో కూడా ఈ-కారు రేసులో గవర్నర్ పర్మిషన్‌పై చర్చ జరిగింది. ఫార్ములా ఈ-రేసులో జరిగిన దోపిడీపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. కేటీఆర్ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేస్తుంది. కేటీఆర్‌ను రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. '' ఈ-కారు రేసు విచారణకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు. గవర్నర్ అనుమతిని సీఎస్ ఏసీబీకి పంపిస్తారు. చట్టప్రకారమే ఏసీబీ దర్యాప్తు చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
Also Read: WHO: ప్రతీ గంటకూ 30 మంది మృతి..డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ రిపోర్ట్