Israel: హెజ్బుల్లాను అంతమొందించేందుకు ఎప్పటి నుంచో ప్లాన్

ప్రస్తుతం హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ఆ దేశ సైన్యం ఎప్పటి నుంచో సీక్రెట్ ఆపరేషన్లు చేస్తోందని తెలిసింది. దీని కోసం దాదాపు 200 రాత్రులు 70 సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించిందని ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు.

New Update
lebanon

Israel Secret Operation On Hezbollah: 

ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో ప్రత్యక్ష దాడులు చేస్తున్నాయి. పదాతి దళాలు గల్లీగల్లీని వెతికి మరీ హెజ్బుల్లాను నాశనం చేస్తున్నాయి. అయితే దీనికి ఇజ్రాయెల్ చాలా రోజుల నుంచి వ్యూహ రచన చేస్తోంది. పేజర్, ఎలక్ట్రానికి వస్తువుల పేలుళ్లకు కొన్ని నెలల ముందు నుంచే  సీక్రెట్‌ ఆపరేషన్లు మొదలుపెట్టిందని తెలుస్తోంది.  ఆప్లాన్ ప్రకారమే లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లిన ఐడీఎఫ్‌ కమాండోలు వందల స్థావరాలను లోలోపలే ధ్వంసం చేసి వచ్చారు. దీని ద్వారానే హమాస్ తరహాలో అక్టోబర్‌ 7 న హెజ్బొల్లా  చేపట్టిన ‘కాంకర్‌ ది గలిలీ’ ఆపరేషన్‌ను లోలోపలే నిర్వీర్యం చేశారు. ఆ సంస్థ రంద్వాన్‌ ఫోర్స్‌ను పూర్తిగా ధ్వంసం చేసిందని వార్తా కథనాలు వెలువడుతున్నాయి.

లెబనాన్ నుంచి హెజ్బుల్లా దాడులు చేయడం ఖాయమని తెలుసుకున్న ఇజ్రాయెల్‌ దళాలు దేశ సరిహద్దుల్లో రక్షణ ఏర్పాట్లను బలోపేతం చేశాయి. దీంతోపాటు సమీపంలోని హెజ్‌బొల్లా స్థావరాలపై వరుస దాడులు నిర్వహించింది. దీంతో చాలా చోట్ల నుంచి రంద్వాన్‌ దళ సభ్యులు తిరిగి లెబనాన్‌ లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఐడీఎఫ్‌ కమాండోలు, కాంబాట్‌ ఇంజినీరింగ్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగి డజన్ల కొద్దీ సొరంగాలు, హెజ్‌బొల్లా వ్యవస్థలను, ఆర్పీజీ, యాంటీట్యాంక్‌ క్షిపణులు, పేలుడు పదార్థాలు, మోర్టార్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకొన్నాయి. వాటిని అక్కడిక్కడే ధ్వంసం చేశాయి. దీని కోసం దాదాపు 200 రాత్రులు 70 సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించిందని ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు.  1000కు పైగా హెజ్బుల్లా స్థావరాలను నానం చేశామని చెప్పారు.

Also Read: హీరోయిన్లు అంటే అంత చులకనా– సురేఖపై ప్రకాష్ రాజ్ మండిపాటు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు