Deep Fake Law:
దక్షిణ కొరియాలో డీప్ ఫేక్ విషయం గొడవ అయింది. టెలీగ్రామ్ వంటి గ్రూప్‌లలో వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా షేర్ అయ్యాయి. దీంతో దేశం మొత్తం అంతా నిరసన వ్యక్తం అయింది. డీప్ ఫేక్ ఫొటోలు, వీడీయోలు సృష్టించేవారికి కఠినమైన శిక్షలు అమలు చేయాలనే డిమాండ్ వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా పార్లమెంటు కీలక బిల్లును ప్రవేశపెట్టింది. డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు కలిగి ఉన్నా, చూడటం నేరంగా పరిగణించే బిల్లుకు ఆమోదం లభించింది. ఇలాంటి పనులు చేసేవారికి కఠినమైన శిక్షలు పడతాయని తేల్చి చెప్పింది.
బిల్లు ప్రకారం డీప్ ఫేక్‌కు సంబంధించిన మెటీరియల్ కొనుఓలు చేసినా, అమ్మినా..మూడేళ్ళ వరకూ జైలు శిక్ష లేదా 30 మిలియన్ వాన్ వరకూ జరిమానా విధిస్తారు. అలాగే చేసిన పనిని బట్టి ఇప్పటికే ఉన్న లైంగిక వేధింపు నిరోధక, రక్షణ చట్టం ప్రకారం ఐదేళ్ళ జైలు శిక్ష, 50 మిలియన్ వాన్ జరిమానా కూడా విధిస్తారని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం తీవ్ర నేరాలకు గరిష్టంగా ఏడేళ్ళ శిక్ష కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ కొత్త చట్టం బిల్లు అమలు కావాలంటే దక్షిణ కొరియా రాష్ట్రపతి ఆమోదం తెలపాలి. దక్షిణ కొరియా పోలీసులు ఇప్పటివరకూ 800కు పైగా డీప్ ఫేక్ కేసులను నమోదు చేశారు.
Also Read: ముమ్మరంగా ప్రచారం..ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకున్న కమలా, ట్రంప్