ఇటీవల సౌత్ కొరియాలో మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఎందరో అందమైన యువతులతో 81 ఏళ్ల బామ్మ పోటీపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొరియాకి చెందిన చోయీ సూన్ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్‌గా పోటీ చేసిన అత్యంత పెద్ద వయస్సుగా చరిత్ర సృష్టించారు. ఈ పోటీలో ఈమెకు కిరీటం వరించకపోయిన బెస్ట్ డ్రెస్సర్ అవార్డు లభించింది. పేదరికంలో పుట్టిన ఈమె కష్టపడి నర్సు శిక్షణ చదివి ఆసుపత్రిలో ఉద్యోగం చేశారు.
ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
70 ఏళ్ల వయస్సులో..
పెళ్లి, పిల్లలు, ఉద్యోగం అంతా సాఫీగానే సాగుతున్న సమయంలో అనుకోని కారణాలతో 40 ఏళ్ల వయస్సులో తన భర్త నుంచి విడిపోయారు. ఒంటరిగానే పిల్లలను పోషించారు. స్నేహితులు మోసం చేయడం వల్ల కటిక పేదరికాన్ని అనుభవించారు. 70 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఓ రోగి మీరు మోడల్‌గా ఎందుకు ప్రయత్నించకూడదని అనడంతో ఆమె లైఫ్‌లో టర్న్ తీసుకున్నారు. ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచేలా చేయాలని మోడలింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి మోడల్‌గా రాణించి.. మిస్ యూనివర్స్ కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించారు.
ఇది కూడా చూడండి: రుణమాఫీ కాలేదని.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య