/rtv/media/media_files/2025/01/29/eSVVGSKxYoLpRziYdBRZ.jpg)
Sunita Williams
Sunita Williams : భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమిమీదకు చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం అంతరిక్ష నౌక ‘డ్రాగన్’ అన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం ‘డ్రాగన్’ భూమికి ప్రయాణం మొదలుపెడుతుంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 3:27 గంటలకు ఫ్లోరిడా తీరానికి దగ్గరలో ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరుగా ఆస్ట్రొనాట్లు బయటికి వస్తారని నాసా సోమవారం వెల్లడించింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే అనుకున్న టైమ్‌కు ఆస్ట్రొనాట్లు భూమిపై అడుగుపెడ్తారని వివరించింది. ఈమేరకు ప్రయాణానికి సిద్ధమవుతున్న వారి ఫొటోలను నాసా విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: ఎంత ట్రై చేసినా నిద్ర రావడం లేదా..అయితే ఇవి తినండి
కాగా ఈ మేరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి క్రూ10 రాకెట్ విడిపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.41 నిమిషాలకు క్రూడ్రాగన్ వ్యోమనౌక భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. --- బుధవారం ఉదయం 3.27 నిమిషాలకు ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సముద్రంలో ల్యాండ్ అవనుండడంతో రెస్య్కూ చేయనున్నారు. ఉదయం 8.15గంటల తర్వాత హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు సునీతా బృందం చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ను కూడా కంట్రోల్ చేసే ఎండు ద్రాక్ష..ఇంకా ఎన్నో ప్రయోజనాలు
వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్ డాకింగ్ లైవ్ కవరేజీ మొదలవుతుంది. క్రూ9 స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా అన్‌డాకింగ్ అయ్యాక మంగళవారం సాయంత్రానికి భూమి వైపు తన జర్నీ ప్రారంభిస్తుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక భూ కక్ష్యలను దాటి కిందికి వస్తుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగుతుంది. అక్కడి నుంచి ఆస్ట్రొనాట్లను ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్తారు. జాన్సన్ స్పేస్ సెంటర్‌లో సునీతా విలియమ్స్‌కు వైద్య పరీక్షలు చేస్తారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడంతో శారీరక పరిస్థితిపై డాక్టర్ల ట్రీట్‌మెంట్ చేస్తారు.
ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
భూ వాతావారణానికి అలవాటు పడేలా సునీతకు వైద్యం అందించనున్నారు. ఎక్కువ రోజులు స్పేస్‌లో ఉండటంతో బుచ్ విల్మోర్ కంటే సునీతా విలియమ్స్ మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు. స్పేస్‌లో గ్రావిటీ ఉండదు. దీంతో ఆస్ట్రొనాట్లు ఐఎస్ఎస్లో గాల్లో తేలుతుంటారు. భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే వారికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
భూమిపై అడుగుపెట్టాక వాళ్లు నడవలేరు. నెలల పాటు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది. వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందిపడొచ్చు. స్పేస్‌లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. లో బీపీ, ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలూ ఎదురవుతాయి.
ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మొదలు నుంచి ఆస్ట్రొనాట్లు భూమిపై అడుగుపెట్టే వరకు మొత్తం ప్రక్రియను లైవ్‌గా చూసేందుకు అవకాశం కల్పించినట్లు నాసా తెలిపింది. మంగళవారం ఉదయం 8.30 గంటలకు నాసా టీవీ, నాసా వెబ్‌సైట్‌తో పాటు, యూట్యూబ్ చానెల్లోనూ చూడొచ్చని ప్రకటించింది. కాగా, సునీతాను భూమ్మీదికి తీసుకొచ్చేందుకు అమెరికా, జపాన్, రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో వెళ్లారు.
9 నెలల తర్వాత...
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో ఐఎస్ఎస్కు 8 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రొనాట్లు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సుమారు 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. కాగా, ఐఎస్ఎస్లో ఎక్కువకాలం గడిపిన రికార్డు ఫ్రాంట్ రూబియో పేరిట ఉంది. ఆయన 371 రోజులు ఐఎస్ఎస్లో ఉన్నారు. ఇదే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు. ఐఎస్ఎస్లో ఎక్కువ కాలం గడిపిన ప్రముఖ ఆస్ట్రొనాట్ల జాబితాలో సునీతా విలియమ్స్ చేరారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!